iDreamPost

‘జైలర్’ నటుడికి మర్చిపోలేని బహుమతి ఇచ్చిన రజినీకాంత్!

  • Author singhj Published - 06:38 PM, Wed - 23 August 23
  • Author singhj Published - 06:38 PM, Wed - 23 August 23
‘జైలర్’ నటుడికి మర్చిపోలేని బహుమతి ఇచ్చిన రజినీకాంత్!

టాప్ హీరోలకు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేదని మరోమారు నిరూపించారు తలైవా రజినీకాంత్. మిగతా హీరోలతో పోలిస్తే తన ఇమేజ్ పూర్తిగా భిన్నమని ఆయన ప్రూవ్ చేశారు. ఒకే ఒక్క సినిమాతో తనపై వస్తున్న విమర్శలకు ఆయన మైండ్ బ్లాంక్ చేసే జవాబిచ్చారు. ‘రోబో 2’ తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందులు పడ్డారు రజినీ. దీంతో ఆయన పనైపోయిందనే కామెంట్స్ బాగా వినిపించాయి. కానీ గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా బదులిచ్చారాయన. తలైవా నటించిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

‘జైలర్’ వసూళ్లు చూసి ట్రేడ్ షాక్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు నాట కూడా ఈ సినిమా వసూళ్లు వావ్ అనేలా ఉన్నాయి. రజినీకాంత్ జస్ట్ అలా స్లోమోషన్​లో నడుచుకుంటూ వస్తే.. ఆయనకు రూ.500 కోట్లు దాసోహమయ్యాయి. ‘రోబో 2’ తర్వాత మళ్లీ ఆ రేంజ్ వసూళ్లు సాధించిన రజినీకాంత్ సినిమా ఇదేనని చెప్పాలి. తలైవా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ‘జైలర్’ మేనియాలో ఉన్నారు. రజినీ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. ఇక, ‘జైలర్’లో తలైవా పెద్దగా ఆయుధాలేమీ వాడలేదు. జస్ట్ అలా స్టైల్​గా నడుచుకుంటూ రావడం, గాగుల్స్​ను పెట్టుకుంటూ చిన్నపాటి నవ్వు నవ్వడం లాంటివి చేశారు.

‘జైలర్​’లో రజినీకాంత్ వాడిన గాగుల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అప్పట్లో ‘బాషా’ సినిమాలో తలైవా వేసుకున్న అద్దాలు పాపులరైన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ‘జైలర్’లో స్టైలిష్ లుక్ కోసం రజినీ సన్​గ్లాసెస్ వాడారు. అయితే ఈ గ్లాసెస్​ను ఒకరికి బహుమతిగా ఇచ్చేశారాయన. ఈ గిఫ్ట్​ను అందుకున్నది ఎవరో కాదు.. ‘జైలర్’ నటుడు జాఫర్ సాదిఖ్. ఇందులో రజినీకి అతడు అనుచరుడిగా నటించాడు. ఆ టైమ్​లోనే ఆ సన్​గ్లాసెస్ తనకు ఇవ్వాలని తలైవాను జాఫర్ కోరాడట. దీనికి ఒప్పుకున్న రజినీ తన కళ్లజోడును ఇచ్చేశారట. ఈ విషయాన్ని జాఫర్ సోషల్ మీడియాలో వెల్లడించాడు.

 

View this post on Instagram

 

A post shared by J A F F E R S A D I Q (@jaffer__sadiq)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి