iDreamPost

RRR collections ఆర్ఆర్ఆర్ 25 రోజుల వసూళ్లు

RRR collections ఆర్ఆర్ఆర్ 25 రోజుల వసూళ్లు

గత నెల 25న విడుదలైన RRR విజయవంతంగా 25 రోజుల రన్ ని పూర్తి చేసుకుంది. కెజిఎఫ్ 2 వచ్చాక దూకుడు బాగా తగ్గినప్పటికీ వీకెండ్స్ లో మాత్రం జోరు కొనసాగుతూనే ఉంది. చాలా చోట్ల శని ఆదివారాలు హౌస్ ఫుల్స్ నమోదవుతున్నాయి. కెజిఎఫ్ 2 కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో థియేటర్ లో ఆర్ఆర్ఆర్ ఇంకా చూడని వాళ్ళు రాజమౌళికే ఓటు వేస్తున్నారు. సహజంగానే వీక్ డేస్ లో మాత్రం డ్రాప్ ఎక్కువగా ఉంది. నైజామ్ లో చాలా చోట్ల ఇంకా టికెట్ రేట్లు తగ్గించకపోవడం ప్రభావం చూపిస్తోంది. మల్టీ ప్లెక్సులు ఇప్పటికీ 295 రూపాయలని కొనసాగించడం అది కూడా నాలుగో వారంలో అంటే ఇబ్బంది కలిగించేదే.

ఇక లెక్కల విషయానికి వస్తే పాతిక రోజులకు గాను సుమారు 590 కోట్లకు చేరువలోకి వెళ్లిన ట్రిపులార్ గ్రాస్ పరంగా చూసుకుంటే 1100 కోట్లకు దగ్గరగా వెళ్తోంది. ఫైనల్ గా బాహుబలి 2కి దాటగలదా అంటే కష్టమే అని చెప్పాలి. ఒకవేళ వీలైనంత త్వరగా చైనా జపాన్ లో రిలీజ్ చేస్తే అప్పుడు ఈజీగా దీంతో పాటు దంగల్ వరల్డ్ వైడ్ ని క్రాస్ చేయొచ్చు. కొన్ని ఏరియాలు తప్పించి విడుదలైన ప్రతి చోట్ల బ్రేక్ ఈవెన్ అందుకున్న ఆర్ఆర్ఆర్ కు సక్సెస్ ఈవెంట్ చేసి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ జక్కన్న టీమ్ కి అలాంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ ఏమి కనిపించడం లేదు. వరల్డ్ వైడ్ షేర్స్ ఈ విధంగా ఉన్నాయి

నైజామ్ – 109 కోట్ల 80 లక్షలు
సీడెడ్ – 50 కోట్ల 10 లక్షలు
ఉత్తరాంధ్ర – 34 కోట్ల 25 లక్షలు
ఈస్ట్ గోదావరి – 15 కోట్ల 83 లక్షలు
వెస్ట్ గోదావరి – 12 కోట్ల 95 లక్షలు
గుంటూరు – 17 కోట్ల 79 లక్షలు
కృష్ణా – 14 కోట్ల 33 లక్షలు
నెల్లూరు – 9 కోట్ల 05 లక్షలు

ఏపి/తెలంగాణ మొత్తం 25 రోజుల షేర్ – 264 కోట్ల 10 లక్షలు

కర్ణాటక – 42 కోట్ల 70 లక్షలు
తమిళనాడు – 37 కోట్ల 55 లక్షలు
కేరళ – 10 కోట్ల 35 లక్షలు
హిందీ – 125 కోట్ల 75 లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా – 9 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా 25 రోజుల షేర్ – 587 కోట్ల 86 లక్షలు

కెజిఎఫ్ 2 ఎఫెక్ట్ ఎంత ఉన్నా ఆర్ఆర్ఆర్ ఫైనల్ రన్ కు వచ్చిందని చెప్పలేం. వచ్చే వారం కొత్త సినిమాలేవీ లేవు. 29న ఆచార్య వచ్చే దాకా ఇంకో పది రోజుల పాటు ఫ్రీ గ్రౌండ్ ఉంది. సో ఎంతో కొంత రాబట్టుకుంటూనే ఉంటుంది. ఇక మే నుంచి పూర్తిగా నెమ్మదించడం ఖాయం. అయితే ఆర్ఆర్ఆర్ యాభై రోజుల సెంటర్లు లాక్ అయ్యాయని వినిపిస్తున్న నేపథ్యంలో అని ఎన్ని ఉంటాయనేది వేచి చూడాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కువ ఆశించలేం కానీ మెయిన్ సెంటర్స్ పరంగా మంచి నెంబర్ రావొచ్చు. 1000 కోట్ల గ్రాస్ ని దాటేసిన ఆర్ఆర్ఆర్ సెన్సేషన్ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో లెట్ వెయిట్ అండ్ సీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి