iDreamPost

‘కల్కి’లో రాజమౌళి.. ప్రభాస్ కోసం ఆ పని చేయబోతున్నాడా?

  • Author ajaykrishna Updated - 11:19 AM, Wed - 30 August 23
  • Author ajaykrishna Updated - 11:19 AM, Wed - 30 August 23
‘కల్కి’లో రాజమౌళి.. ప్రభాస్ కోసం ఆ పని చేయబోతున్నాడా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వరుసగా పాన్ ఇండియా మూవీస్ లైనప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకులను పలకరించిన డార్లింగ్.. ఇప్పుడు సలార్ ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో రిలీజ్ అవుతోంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని.. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. సలార్ తో పాటు ప్రభాస్.. మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా చకచకా పూర్తి చేస్తున్న విషయం విదితమే. ఆ సినిమానే కల్కి 2898 AD.

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. కల్కి మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందుతోంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన కల్కి టీజర్.. ఒక్కసారిగా వరల్డ్ వైడ్ ఆడియన్స్ అంతా.. టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా, ఫ్రెష్ గా కనిపిస్తుంది. వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ మోస్ట్ ప్రెస్టిజియస్ మూవీలో.. లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కల్కి మూవీలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి జాయిన్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటి.. కల్కి సినిమాలో రాజమౌళి ఏంటని అందరికీ సందేహం రావచ్చు. తాజా సమాచారం ప్రకారం.. కల్కిలో రాజమౌళి ఓ స్పెషల్ క్యామియో రోల్ చేయనున్నాడని కొన్ని కథనాలు చెబుతున్నాయి. మరోవైపు రాజమౌళి డైరెక్షన్ టీమ్ లో చేరాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రాజమౌళి చేరాడని వినిపించేసరికి.. ఫ్యాన్స్ ఒక్కసారిగా కల్కి గ్లోబల్ రేంజ్ కి వెళ్ళిపోతుందని మురిసిపోతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ రాజమౌళి కల్కి సెట్ వర్క్ చూడటానికి వెళ్ళాడేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి కల్కి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి