iDreamPost

Rajamouli రాజమౌళి సెంటిమెంట్ – హిస్టరీ రిపీట్స్

Rajamouli రాజమౌళి సెంటిమెంట్ – హిస్టరీ రిపీట్స్

రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా దాని తర్వాతది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ని ఆచార్య కూడా బ్రేక్ చేయలేకపోయింది. తమ మూవీ దాన్ని మారుస్తుందని చిరంజీవి పదే పదే చెప్పినప్పటికీ ఫైనల్ గా సెంటిమెంటే గెలిచింది. ఎందుకంటే ఆచార్యను కేవలం చిరు మూవీగా చెప్పలేదు. రామ్ చరణ్ కూ సమానమైన ప్రాధాన్యత ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో ఇది మెగా పవర్ స్టార్ ఖాతాలోకి కూడా వస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా తక్కువ గ్యాప్ లో వచ్చిన ఆచార్య ఊహించని విధంగా దారుణమైన రిపోర్ట్స్ తో డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. ఫైనల్ లాస్ ఎంత ఉండొచ్చో ఊహకందడం లేదు.

ఇది ఏళ్ళ తరబడి జరుగుతున్న రాజమౌళి సెంటిమెంట్ చరిత్ర. ముందు జూనియర్ ఎన్టీఆర్ సంగతి చూస్తే ‘స్టూడెంట్ నెంబర్ వన్’ తర్వాత ‘సుబ్బు’ ఘోరమైన ఫ్లాప్. ”సింహాద్రి’ తర్వాత ‘ఆంధ్రావాలా’ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేని పీడకల. ‘యమదొంగ’ అయ్యాక చేసిన ‘కంత్రి’ తిరస్కారానికి గురయ్యింది. నెక్స్ట్ ట్రిపులార్ తర్వాత కొరటాల శివనే దర్శకుడు కావడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. రామ్ చరణ్ ‘మగధీర’ చేశాక ‘ఆరంజ్’ దెబ్బకు బాబాయ్ నాగబాబుకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలిగింది. సునీల్ ‘మర్యాదరామన్న’లో హీరోగా చేశాక ‘కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు’తో సూపర్ ఫెయిల్యూర్ అందుకోవాల్సి వచ్చింది.

ప్రభాస్ సైతం మినహాయింపు కాలేకపోయాడు. ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’ సోసో అయ్యింది. అంతకు ముందు ‘ఛత్రపతి’ విజయాన్ని ‘పౌర్ణమి’ నీరుగార్చేసింది. నాని ‘ఈగ’లో నటించాక ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ పెద్దగా ఆడలేదు. ఇంత అప్రతిహతంగా రాజమౌళి ఆఫ్టర్ ట్రాక్ రికార్డు హీరోలకు నిద్ర రాకుండా చేసింది. ఇప్పుడు ఆచార్య చూశాక ఇది మరోసారి కన్ఫర్మ్ అయ్యింది. కాబట్టి తారక్ ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందడంలో అర్థం ఉంది. ఒకవేళ ఇది హిట్ అయితే అప్పుడు కొరటాల శివనే తన మీద పడ్డ మచ్చను చెరిపేసుకున్నట్టు అవుతుంది. కాకపోతే ఇంత విచిత్రమైన నెగటివ్ సెంటిమెంట్ ఎవరికీ లేకపోవడం మాత్రం అనూహ్యం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి