iDreamPost

మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు.. అసెంబ్లీ లో బిల్లు

మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు.. అసెంబ్లీ లో బిల్లు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు ఇక లాంఛనమే కానున్నాయి. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గనరాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రకటించారు.

శాసన నిర్మాణ రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, కార్యనిర్వాహఖ రాజధానిగా విశాఖను ప్రతిపాదిస్తున్నట్లు బుగ్గన వెల్లడించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన వికేంద్రీకరణ, అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు – 2020 పై చర్చ సందర్భంగా మంత్రి ఈ మేరకు ప్రకటించారు.

Read Also: అసెంబ్లీ ప్రారంభం.. సభ ముందుకు రెండు బిల్లులు..

సుప్రిం కోర్టు నుంచి అన్ని అనుమతులు వచ్చాక హైకోర్టు తరలింపు ప్రక్రియ చేపడతామని మంత్రి తెలిపారు. విశాఖలో సచివాలయంతోపాటు గవర్నర్‌ నివాసమైన రాజ్‌భవన్‌ కూడా అక్కడే ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి