iDreamPost

తెలంగాణాలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు..!

తెలంగాణాలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు..!

వర్షాకాలం మొదలైన నాటి నుండి.. తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. జులైలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్, వరంగల్‌తో సహా పలు నగరాలు, పల్లెటూళ్లు వరద నీటిలో చిక్కుకున్న సంగతి విదితమే. జన జీవనం అస్తవ్యస్థమైంది. రోడ్లన్నీ సముద్రాలను తలపించాయి. కొద్ది పాటి వర్షాలకే మోకాళ్ల లోతులో నీరు చేరింది. ఇక చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల వద్ద భారీగా వరద నీరు చేరింది. ఆ సమయంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని బతికారు. కాస్త వాన తెరిపించింది అనగానే.. ఇటీవల మళ్లీ వానలు పడుతూనే ఉన్నాయి.

గత వారం నుండి తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు విస్తారంగా పడుతున్నాయి. పొద్దున ఎండ కాస్తుండగా.. సాయంత్రానికి వాతావరణానికి చల్లబడిపోతుంది. వరుణుడు వెంటనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మొన్నటి మొన్న హైదరాబాద్‌లో కుండకు చిల్లులు పడినట్లు వర్షం కురిసింది. కాగా, రానున్న మరో మూడు రోజుల పాటు వానలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. శని, ఆదివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి