iDreamPost

హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం!

Hyderabad Rain: మార్చి నెల మొదలైన్పటి నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు అల్లల్లాడుతున్నారు. తాజాగా వాతావరణం చల్లబడింది. నగరంలో పలు ప్రాంతాలల్లో చిరుజల్లులు కురిశాయి.

Hyderabad Rain: మార్చి నెల మొదలైన్పటి నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు అల్లల్లాడుతున్నారు. తాజాగా వాతావరణం చల్లబడింది. నగరంలో పలు ప్రాంతాలల్లో చిరుజల్లులు కురిశాయి.

హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం!

నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమైంది.. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. నిన్నటి వరకు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. తాజాగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. మొన్నటి వరకు ఎండ వేడిమితో అల్లల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో రిలాక్స్ అవుతున్నారు. కొండపూర్, మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో సోమవారం అక్కడక్కడ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది.  నాంపల్లి, లకిడికపూల్, ఖైరతాబాద్, మొజంజాహి, కొండపూర్, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉంది. ఉపరితల ద్రోని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు గ్రేటర్ లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల తో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరంలోని ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణలో పలు జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే.. వాతవరణం చల్లబడటంతో ప్రజలు రిలాక్స్ అవుతున్నారు. నిన్నటి వరకు ఎండ వేడికి తో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. పగటి పూట బయటకు రావాలంటే భయపడిపోయారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతుందని వెల్లడించారు. రాగల మూడు రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, కొమురం భీం, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి