iDreamPost

రైళ్లలో టీ తాగుతున్నారా? ఈ వీడియో చూస్తే మళ్ళీ లైఫ్‌లో తాగరు

మొన్నా మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాసిడ్, కొన్ని కెమికల్స్ తో కలిపి చేస్తున్నారన్న వార్త బయటకొచ్చింది. దీనిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాజాగా భారతీయ రైల్వేలో టీ ఎలా చేస్తున్నారో అనే వీడియో ఒకటి బయటకొచ్చింది.

మొన్నా మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాసిడ్, కొన్ని కెమికల్స్ తో కలిపి చేస్తున్నారన్న వార్త బయటకొచ్చింది. దీనిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాజాగా భారతీయ రైల్వేలో టీ ఎలా చేస్తున్నారో అనే వీడియో ఒకటి బయటకొచ్చింది.

రైళ్లలో టీ తాగుతున్నారా? ఈ వీడియో చూస్తే మళ్ళీ లైఫ్‌లో తాగరు

తినే ఆహారం, తాగే పానీయం రుచిగానే కాదు.. శుచిగా కూడా ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు అంటే రుచిగా, శుచిగా చేసుకోవడం కుదురుతుంది. కానీ దూర ప్రయాణాలప్పుడు అంటే రుచిగా, శుచిగా చేస్తున్నారో లేదో అన్న డౌట్ ఉంటుంది. నాణ్యత అనేది చాలా ముఖ్యం. కానీ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కొంతమంది శుభ్రత లేకుండా చేసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. మురికి కాలువ నీటితో పానీ పూరీలు చేసే వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది. దీంతో చాలా మందికి పానీ పూరీ మీద విరక్తి పుట్టింది. తాజాగా రైళ్లలో టీ తాగాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు ఇద్దరు వ్యక్తులు.

చాలా మంది దూర ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అయితే తిను బండారాలు, టీ, కాఫీ వంటివి రైళ్లలోకి తెచ్చి అమ్ముతుంటారు. చాలా మంది వాటిని కొనుక్కుని ఎంచక్కా తింటూ, తాగుతుంటారు. అయితే ఆ ఆహార పదార్థాలను వాళ్ళు చేసే విధానం చూస్తే మాత్రం అస్సలు ముట్టుకోరు. తాజాగా ఓ వీడియో వైరల్ నెట్టింట అవుతోంది. ఈ వీడియో చూస్తే.. ఛీ ఇలా చేస్తున్నారేంటి అని అసహ్యించుకుంటారు. ఈ వీడియోలో ఇద్దరు రైల్వే ఉద్యోగులు కింద మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నారు. టీ క్యాన్ లో వాటర్ హీటర్ రాడ్ పెట్టారు. క్యాన్ లో ఉన్న పాలను వాటర్ హీటర్ తో వేడి చేస్తున్నారు. దీన్ని ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

భారతీయ రైల్వే ఇలా మీకు టీ అందిస్తుంది. ట్యాప్ వాటర్ ని.. అలానే వేడి చేసేందుకు వాటర్ హీటర్ ని వాడుతున్నారు’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ దీనిపై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకేనేమో రైల్వేలో టీ వేడి నీరు తాగినట్టు ఉంటుంది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. వాటర్ హీటర్ తో వేడి చేయడం వల్ల సమస్య ఏంటి అని మరొక నెటిజన్ కామెంట్ చేయగా.. దానికి మరొక నెటిజన్ స్పందించాడు. వాటర్ హీటర్ కి ఉండే తుప్పు టీలో కలిసి ఆ తర్వాత కడుపులోకి వెళ్తుంది. దాని వల్ల చాలా ప్రమాదం అంటూ కామెంట్ చేశాడు. మన దేశంలో పరిశుభ్రత ఇల్లీగల్ అని మీకు తెలుసా? అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఈ ఘటన ఖచ్చితంగా ఉత్తర భారతదేశంలోదే అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఆహారం విషయంలో రైల్వే తీరు ఎన్నటికీ మారదని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.

అందరూ రైల్వే ఉద్యోగులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఒక్కసారి రైల్వే మంత్రిని అడగండి అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ స్టీల్ క్యాన్ లో నిజంగా నీళ్లు కలిపారో లేదో తెలియదు కానీ వాళ్ళు వేడి చేయడానికి వాటర్ హీటర్ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. ఆ వాటర్ హీటర్ ని బాత్రూంలో స్నానం చేసేందుకు వాడే బకెట్ లో పెట్టిందేమో ఎవరికి తెలుసు. దీని వల్ల బాత్రూంలో ఉండే క్రిములన్నీ దానికే ఉంటాయి. ఇక తుప్పు కావాల్సినంత ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం టీ వేడి చేయడానికి ప్రత్యేకంగా హీటర్ రాడ్ వాడుతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ట్రైన్ లో ఉన్న ట్యాప్ వాటర్ తో టీ చేస్తున్నారని అంటున్నారు. మరి ఎంతమంది శుభ్రంగా ఉంటున్నారో.. ఎంతమంది నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rohit_mehani (@rohit_mehani)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి