iDreamPost

రైల్వే కూలీగా మారిన రాహుల్‌ గాంధీ.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫొటో!

  • Published Sep 21, 2023 | 2:30 PMUpdated Sep 21, 2023 | 2:30 PM
  • Published Sep 21, 2023 | 2:30 PMUpdated Sep 21, 2023 | 2:30 PM
రైల్వే కూలీగా మారిన రాహుల్‌ గాంధీ.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫొటో!

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. గత కొంతకాలం నుంచి రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ప్రచార శైలిని మార్చారు. జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పర్యటించారు. సమయం దొరికితే చాలు జనాలతో మమేకవుతూ.. వారితో ముచ్చటిస్తూ.. సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సామాన్యులతో కలిసిపోయి.. వారితో కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రాహుల్‌ గాంధీ రైల్వే కూలీ అవతారం ఎత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా.. రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే కూలీలను కలిశారు. వారితో చాలా సేపు ముచ్చటించి.. వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తరవాత వారి మాదిరిగానే పోర్టర్ డ్రెస్ వేసుకుని బ్యాడ్జ్ పెట్టుకున్నారు. అంతటితో ఆగక.. రైల్వే కూలీలా మారి ఓ సూట్‌కేసుని తల మీద పెట్టుకుని మోసుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది రాహుల్ గాంధీ రావడంతో.. వందలాది మంది కూలీలు ఆయన చుట్టూ చేరి సందడి చేశారు.

గత నెలలో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కూలీలు.. రాహుల్‌ గాంధీ.. తమ వద్దకు రావాలని.. తమ సమస్యలను తెలుసుకోవాలని కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అది కాస్త ఇప్పుడు రాహుల్ గాంధీ దృష్టికి చేరింది. ఈ క్రమంలో నేడు ఆయన ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. రైల్వే కూలీలను కలుసుకుని.. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. తమ కోరిక మన్నించి రాహుల్‌ గాంధీ రావడంతో.. రైల్వే కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి