iDreamPost

వీడియో: ప్రెస్‌మీట్‌లో నోరు జారిన రాహుల్‌..

వీడియో: ప్రెస్‌మీట్‌లో నోరు జారిన రాహుల్‌..

కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలకు సంబంధించి సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో నవంబర్‌ నెలలో ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొంది.  5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే తేదీలు వేరుగా ఉ‍న్నా.. అన్ని రాష్ట్రాల ఫలితాలు మాత్రం డిసెంబర్ 3న వెల్లడించనున్నట్లు తెలిపింది. ఇక, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ సోమవారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నోరు జారారు. రాజస్తాన్‌లో అధికారంలో ఉన్న తమ పార్టీ ఓడిపోతుందని అన్నారు. రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘ నేను మీకు చెప్పాను. బీజేపీవి 10 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక దాంట్లో వారి ఓబీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. మధ్య ‍ప్రదేశ్‌లో వారి ప్రభుత్వమే మళ్లీ వస్తుంది. కాంగ్రెస్‌ ఓడిపోతుంది. రాజస్తాన్‌లో కూడా కాంగ్రెస్‌ ఓడుతుంది. ఛత్తీష్‌ఘడ్‌లో కూడా ఓడిపోతుంది’’ అని అన్నారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆయన మాటల్ని సరిచేశారు.

దీంతో తన పొరపాటు అర్థం చేసుకున్న రాహుల్‌ వెంటనే ‘‘సారీ నేను మీ కన్‌ఫ్యూజ్‌ చేసే సరికి మార్చి చెప్పాను. ఛత్తీష్‌ఘడ్‌లో మా ప్రభుత్వం ఉంది. మళ్లీ వస్తుంది. రాజస్తాన్‌, చత్తీష్‌ఘడ్‌, తెలంగాణల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుంది. మధ్య ప్రదేశ్‌లో ఓడిపోతుంది. సీరియస్‌గా చెప్పాలంటే.. అన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. మా ప్రభుత్వం పాలనలో ఉన్న రాష్ట్రాల గురించి కచ్చితంగా చెబుతాను’’ అని అన్నారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, రాహుల్‌ ప్రెస్‌మీట్‌లో నోరు జారటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి