iDreamPost

Radhe Shyam : ప్రభాస్ టీమ్ అలాంటి రిస్క్ చేయదు

Radhe Shyam : ప్రభాస్ టీమ్ అలాంటి రిస్క్ చేయదు

నిన్న సాయంత్రం నుంచి ఉన్నట్టుండి కొన్ని వెరిఫైడ్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఒక పెద్ద సినిమా డైరెక్ట్ ఓటిటిలో వచ్చేందుకు చర్చలు జరుపుతోందని అది రాధే శ్యామ్ గురించేనని జరిగిన ప్రచారం ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ పుట్టించింది. థియేటర్లు పూర్తిగా మూసివేయక పోయినా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారనే దిశగా సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. అయితే అలాంటి ఆలోచనేది లేదని ఫ్రెష్ గా వచ్చిన అప్ డేట్. డీల్స్ వస్తున్న మాట నిజమే కానీ యువి సంస్థకు అలాంటి ఉద్దేశాలు ఏవీ లేవట. బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం ఉద్దేశించిన గ్రాండియర్స్ ని చిన్ని తెరపై ఫీలవ్వడం అసాధ్యమని అసలా ఆలోచనే లేదని తేల్చేస్తున్నారు.

సో అభిమానులు ఖంగారు పడాల్సిన పని లేదు. రిలాక్స్ అవ్వొచ్చు. కాకపోతే రిలీజ్ డేట్ విషయంలో ఏదో ఒకటి తేల్చేసి ఆర్ఆర్ఆర్ లాగా క్లారిటీ ఇస్తే బెటర్. అసలే ఒక్కో తేదీని ఒక్కొక్కరు మెల్లగా లాక్ చేసుకుంటున్నారు. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మార్చి 25 తీసేసుకుంది. ఆచార్య ఏప్రిల్ 1, ట్రిపులార్ మార్చి 18- ఏప్రిల్ 28, ఎఫ్ 3 ఏప్రిల్ 28, కెజిఎఫ్ 2- బీస్ట్ – లాల్ సింగ్ చద్దాలు ఏప్రిల్ 14 ఇలా భారీ చిత్రాలన్నీ సేఫ్ గా కర్చీఫ్ లు వేసుకుంటున్నాయి. రాధే శ్యామ్ మాత్రమే ఇంకా ఏదీ చెప్పడం లేదు. ఒక తేదీని చెప్పినంత మాత్రాన దానికే కట్టుబడి ఉండాలన్న రూలేమీ లేదు. మార్చుకున్నా ఎవరూ ప్రశ్నించరుగా. అందుకే చెప్పేయడం బెటర్.

రాధాకృష్ణ దర్శకత్వంలో మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన రాధే శ్యామ్ ఇప్పటికే ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బిజినెస్ కూడా గతంలోనే పూర్తి చేశారు. ఇప్పుడిలా పుకార్లు షికారు చేయడం మొదలుపెట్టాయి. వీటికి త్వరగా చెక్ పెట్టడం బెటర్. నిజానికి బయట పరిస్థితులు మరీ తీవ్రంగా లేకపోయినా చిత్ర పరిశ్రమ మాత్రం ఇబ్బందులు ఎదురుకుంటోంది. రిలీజులు తగ్గిపోయాయి. ఏపిలో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సి కొనసాగుతోంది. ఒమిక్రాన్ భయానికి ఫ్యామిలీస్ మళ్ళీ థియేటర్ల వైపు వచ్చేందుకు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ మౌనంగా ఉండటం న్యాయమే కానీ మరీ ఇంతలా కాదు

Also Read : Jana Gana Mana : ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమా తీస్తారా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి