iDreamPost

Radhe Shyam : ప్రభాస్ టీమ్ మేలుకోవాల్సిన టైం వచ్చేసింది

Radhe Shyam : ప్రభాస్ టీమ్ మేలుకోవాల్సిన టైం వచ్చేసింది

ఇవాళ ఆర్ఆర్ఆర్ వీడియో గ్లిమ్ప్స్ చూశాక ఇప్పుడు అందరి దృష్టి మరో పాన్ ఇండియా విజువల్ వండర్ రాధే శ్యామ్ మీదకు వెళ్తోంది. కేవలం వారం రోజుల గ్యాప్ తో తలపడనున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ ఊచకోత చేస్తాయోననే ఆసక్తి ట్రేడ్ లో విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి విషయంలో పోలికలు రావడం సహజం. అలా చూసుకుంటే ప్రభాస్ టీమ్ ఇప్పటికైతే వెనుకబడి ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఆల్రెడీ ఇద్దరు హీరోల వీడియో ఇంట్రోలు విడివిడిగా, ఇవాళ్టితో ఒకటి మొత్తం మూడు టీజర్లు ఇప్పటిదాకా రిలీజ్ చేసింది. ఇవి కాకుండా టైటిల్ ట్రాక్ లిరికల్ రూపంలో ఎప్పుడో వచ్చేసింది. ఇంకా చాలా రెడీ చేస్తున్నారు.

కానీ రాధే శ్యామ్ నుంచి గట్టిగా చెప్పుకునే మెటీరియల్ ఏదీ రాలేదు. మొన్న వచ్చిన ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రో కూడా ఇంగ్లీష్ లో ఉండి ఏదో మొక్కుబడిగా మమ అనిపించుకుందే తప్ప అబ్బో ఇది కదా బాహుబలి రేంజ్ అనిపించేలా ఏమి లేదు. పోనీ దీపావళికైనా టీజర్ ఉంటుందో లేదో క్లారిటీగా చెప్పడం లేదు. యువి సంస్థ సాహో నుంచి పాటిస్తున్న నిర్లక్ష్యాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రభాస్ ఉంటే చాలు ఇంకేమి అక్కర్లేదని అనుకొనే రోజులు కావుగా. అదే నిజమైతే సాహో తెలుగులో అంత పెద్ద ఫ్లాప్ గా ఎందుకు నిలుస్తుంది. డార్లింగ్ కటవుట్ ఒకటే పనిచేయదని అర్థమయ్యింది.

ఇకనైనా రాధే శ్యామ్ టీమ్ ప్రమోషన్లు వేగవంతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. అవతల రాజమౌళి బయటికి చెప్పలేదు కానీ తన టీమ్ తో కలిసి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఈవెంట్ లు చేయడంతో పాటు దుబాయ్ యుఎస్ లాంటి దేశాల్లో కూడా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. అంతటి బ్రాండ్ ఉన్న జక్కన్ననే ఇంత చేస్తున్నప్పుడు ఒక్క సినిమా అనుభవం ఉన్న రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన రాధే శ్యామ్ కు మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు కదా. పైగా హస్తసాముద్రికం చుట్టూ తిరిగే లవ్ అండ్ యాక్షన్ డ్రామా. సున్నితమైన పాయింట్. సో మహేష్ సినిమాలో రష్మిక స్టైల్ లో చెప్పాలంటే యువి మీకు అర్థమవుతోందా అంటున్నారు అభిమానులు

Also Read : RRR Glimpse : రాజమౌళి మార్కు మాయాజాలం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి