RRR Glimpse : రాజమౌళి మార్కు మాయాజాలం

By iDream Post Nov. 01, 2021, 11:31 am IST
RRR Glimpse : రాజమౌళి మార్కు మాయాజాలం

టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు మోస్తున్న రాజమౌళి విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ తాలూకు టీజర్ ఇందాక విడుదల చేశారు. మూడు రోజుల క్రితం ముంబైలో పివిఆర్ మల్టీ ప్లెక్స్ తో కొలాబరేట్ అయ్యాక అక్కడి మీడియాకు ప్రత్యేకంగా చూపించిన ఈ వీడియోని బయటికి రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసి ఎట్టకేలకు అభిమానుల కోసం ఇవాళ రిలీజ్ చేశారు. కేవలం 45 సెకండ్లు మాత్రమే ఉంటుందని ముందే తెలిసినప్పటికీ ఆ కాసిన్ని క్షణాల్లోనూ తమ హీరోలు ఎలా ఉంటారు ఎలాంటి గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయోనని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావిడి చేస్తూనే ఉన్నారు. నిరీక్షణ ఫలించింది

వీడియోలో ఎలాంటి సంభాషణలు లేవు. కేవలం షాట్స్ తో కట్ చేశారు. వేలాదిగా గుమికూడిన సమూహాలు, తారక్ ను వెంటాడుతున్న పులి, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల బులెట్ గుర్రం పందెం, బ్రిటిషర్లతో అజయ్ దేవగన్ తో పాటు ఈ ఇద్దరు హీరోలు చేస్తున్న ఫైట్లు మొత్తం స్టఫ్ ఏ హాలీవుడ్ మూవీకి తీసిపోని రేంజ్ లో ఉంది. ఇంకా ట్రైలర్ వచ్చేది ఉంటుంది కాబట్టి టీజర్ ని చాలా తెలివిగా కట్ చేశారు. చరణ్ తారక్ లు పరస్పరం యుద్ధం చేసుకునే సన్నివేశాలు లాంటివి చూపించలేదు. చెర్రీ పోలీస్ డ్రెస్ లో ఎక్కువ సేపు కనిపించగా జూనియర్ మాత్రం రెండు మూడు షేడ్స్ లో కనిపించి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు.

మొత్తానికి అంచనాలకు తగ్గట్టే ఈ టీజర్ గ్లిమ్ప్స్ సాగింది. ప్రతి ఫ్రేమ్ లోనూ రాజమౌళి మార్క్ స్పష్టం. అనూహ్యంగా ఎంఎం కీరవాణి ఈ సారి ఎలాంటి లౌడ్ సౌండ్ లేకుండా కేవలం బేసిక్ వాయిస్ లో సాగే లైట్ కోరస్, ఇన్స్ ట్రుమెంటేషన్ తో డిఫరెంట్ గా బిజిఎం ఇవ్వడం విశేషం. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం, ఆర్ట్ డైరెక్షన్ ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడ్డాయి. పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టు అభిమానులు కోరుకున్నది ఇందులో ఇచ్చినట్టే కనిపిస్తోంది. 2022 జనవరి 7న విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ అంచనాలు ఇకపై కంట్రోల్ కావడం కష్టమే. కాకపోతే ఈ టీజర్ లో ఎక్కువ ఫుటేజ్ ఆశించిన మూవీ లవర్స్ మాత్రం ట్రైలర్ దాక వెయిట్ చేయాల్సిందే

Also Read : Naga Shaurya :పేకాట కేసులో నాగ శౌర్య పేరెలా వచ్చింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp