iDreamPost

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రచిన్.. ప్రపంచ కప్ హిస్టరీలో తొలి ప్లేయర్ గా..

  • Author Soma Sekhar Published - 03:12 PM, Sat - 4 November 23

48 ఏళ్ల వరల్డ్ కప్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును నమోదు చేశాడు కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్ర. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

48 ఏళ్ల వరల్డ్ కప్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును నమోదు చేశాడు కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్ర. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 03:12 PM, Sat - 4 November 23
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రచిన్.. ప్రపంచ కప్ హిస్టరీలో తొలి ప్లేయర్ గా..

రచిన్ రవీంద్ర.. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో మారుమ్రోగుతున్న పేరు. ఈ మెగాటోర్నీలో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. తాజాగా బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో అద్భుతమైన శతకంతో చెలరేగాడు ఈ చిచ్చర పిడుగు. దీంతో కివీస్ భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ విశ్వసమరంలో రచిన్ కు ఇది మూడో శతకం కావడం విశేషం. ఇక ఈ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు రచిన్. అదీకాక వరల్డ్ కప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు పుట్టల్లోకి ఎక్కాడు ఈ యువ సంచలనం. 48 ఏళ్ల వరల్డ్ కప్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును నమోదు చేశాడు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచ కప్ 2023లో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు కివీస్ నయా సంచలనం రచిన్ రవీంద్ర. భారతీయ మూలాలు ఉన్న ఈ చిచ్చర పిడుగు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్నాడు. తాజాగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో మరో సెంచరీతో చెలరేగాడు. ఇప్పటికే ఈ టోర్నీలో రెండు శతకాలు బాది ఔరా అనిపించిన రచిన్.. మూడో సెంచరీ బాదీ ఏకంగా సచిన్ రికార్డునే బద్దలు కొట్టాడు. ఆడిన తొలి వరల్డ్ కప్ లోనే మూడు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా రచిన్ రికార్డు నెలకొల్పాడు. 48 ఏళ్ల ప్రపంచ కప్ చరిత్రలో మరెవరికీ ఈ ఘనత సాధ్యం కాలేదు. ఈ రికార్డుతో పాటుగా పలు ఘనతలు సాధించాడు రచిన్. అవేంటంటే?

ఓ వరల్డ్ కప్ ఎడిషన్ లో కివీస్ ప్లేయర్ మూడు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ రికార్డులతో పాటుగా ఓ వరల్డ్ కప్ ఎడిషన్ లో 500లకు పైగా రన్స్ చేసిన అతిపిన్న వయస్కుడిగా రచిన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్, ఆసీస్ జట్లపై శతకం బాదిన రచిన్ తాజాగా పాక్ పై సెంచరీతో చెలరేగాడు. ఇక ఈ మ్యాచ్ లో 94 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్స్ తో 108 పరుగులతో సత్తాచాటాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జట్టులో విలియమ్సన్(95), గ్లెన్ ఫిలిప్స్(41), మార్క్ చాంప్మన్(39) రన్స్ తో రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లతో సత్తాచాటాడు. మరి వరల్డ్ కప్ లో రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్న రచిన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి