iDreamPost

జైశ్రీరామ్ అంటేనే హిందువులు కాదు! BJP ఎమ్మెల్యేకి ఆర్ నారాయణమూర్తి క్లాస్!

  • Published Mar 14, 2024 | 7:56 PMUpdated Mar 14, 2024 | 7:56 PM

ఇప్పటికే రజాకార్ సినిమా గురించి ఎన్నో వివాదాలు జరిగాయి. ప్రస్తుతం తెలంగాణాలో రజాకార్ సినిమా రాజకీయంగా రచ్చ లేపుతోంది. ఇప్పుడు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొలిటికల్ పార్టీ నేతల ప్రసంగాలతో.. మరోసారి ఈ సినిమా గురించి వివాదాలు తలెత్తాయి.

ఇప్పటికే రజాకార్ సినిమా గురించి ఎన్నో వివాదాలు జరిగాయి. ప్రస్తుతం తెలంగాణాలో రజాకార్ సినిమా రాజకీయంగా రచ్చ లేపుతోంది. ఇప్పుడు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొలిటికల్ పార్టీ నేతల ప్రసంగాలతో.. మరోసారి ఈ సినిమా గురించి వివాదాలు తలెత్తాయి.

  • Published Mar 14, 2024 | 7:56 PMUpdated Mar 14, 2024 | 7:56 PM
జైశ్రీరామ్ అంటేనే హిందువులు కాదు! BJP ఎమ్మెల్యేకి ఆర్ నారాయణమూర్తి క్లాస్!

ప్రస్తుతం రజాకార్ సినిమా అటు సినీ పరంగా ఇటు రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు తెలంగాణాలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఈ సినిమాను తీసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలతోనే.. రాజకీయంగా వేడి పుట్టించింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే, ఈ ఈవెంట్ లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రజాకర్ సినిమా నిర్మాత.. స్వయంగా ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్న ఓ రాజకీయ నేత కావడంతో.. ఈ ఈవెంట్ కు సినీ ప్రముఖులతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఇక ఈవెంట్‌లో పొలిటికల్ పార్టీ నేతల ప్రసంగాలతో.. అక్కడ మరింత వేడి రగిలింది. ఈ క్రమంలో.. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి, ఆర్ నారాయణమూర్తికి మధ్య జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజకీయ ప్రముఖులంతా ఈ ఈవెంట్ కు అటెండ్ కావడంతో.. సినిమా ఫంక్షన్ కాస్త రాజకీయ వేదికగా మారిపోయింది. ఈ ఈవెంట్ కు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, పీపుల్స్ స్టార్ ఆర్ నారాణయమూర్తి వచ్చారు. అయితే.. సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో.. స్టేజ్ పైన ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డికి ఆర్ నారాయణ మూర్తికి మధ్య మాటల యుద్ధం జరిగింది. రాకేశ్ రెడ్డి రజాకార్ సినిమా గురించి మాట్లాడుతూ.. “రజాకర్ అనేది కేవలం సినిమా మాత్రమే కావొచ్చు. కానీ తమకు ఐదు తరాల పూర్వీకుల నరకయాతన”. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా రజాకార్ మూవీ చూడాలని.. ఇది గతం కాదని మనందరి భవిష్యత్ చరిత్ర అంటూ రాకేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. వీటితో పాటు.. ఆర్ నాయారణమూర్తి చెప్పిన విషయాలను గుర్తు చేస్తూ కూడా మాట్లాడారు. ఇక అప్పడు ఆర్ నారాయణమూర్తి వెంటనే ఆ మాటలపై స్పందించారు.

ఆర్ నారాయణమూర్తి.. మాట్లాడుతూ.. “గుజారాత్‌లోని జునాగఢ్, తెలంగాణను భారత్‌లో కలిపి ఉండకపోతే ఈరోజు ప్రజాస్వామం ఉండేది కాదు. ఓవైపు.. భారత్ నుంచి హిందువులంతా వెళ్లిపోతుంటే.. వచ్చే ఐదేళ్లు కూడా బీజేపీ 400 ఎంపీ సీట్లతో పాలిస్తామని ప్రధాని మోదీ అనేవారా..?” అంటూ సమాధానంగా మరో ప్రశ్నను వేశారు. ఇంకా ” ఈ భారతదేశం అందరిది. భిన్న మతాలు, విభిన్న జాతులతో కూడిన దేశమే భారత్. ఎందులోనైనా మత పిచ్చోళ్లని ఖండించాలి. మాత పిచ్చి వద్దు. ఎవరు కూడా తీవ్ర వాదుల యాంగిల్ లో పోవద్దు. ” అంటూ కాస్త ఘాటుగా స్పందించారు. ఇంతలో ఓ వ్యక్తి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో.. మరల ఆయన క్లాస్ తీసుకున్నారు. ఇక ఆర్ నారాయణ మూర్తి ఎంతకీ కూల్ అవ్వకపోవడంతో.. రాకేష్ రెడ్డి ఆయన నుంచి మైక్ తీసుకుని.. “15వ శతాబ్దంలో హిందూ ముస్లింలు అన్నదమ్ములే.. తమ తాతలు, ముత్తాతలు సోదరుల్లాగా ఉండేవాళ్లు”.. అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరి, సినీ ఈవెంట్ లో జరిగిన ఈ రాజకీయ సంభాషణలపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి