iDreamPost

సినీ ప్రేక్షకులకు PVR బంపరాఫర్.. రూ.700 లకు నెలంతా సినిమాలు చూసే ఛాన్స్

PVR Inox Movie Pass: థియేటర్లలో తరచుగా సినిమాలు చూసే వారికి పీవీఆర్‌ ఐనాక్స్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తక్కువ ధరకే ఎక్కువ చిత్రాలు చూసే అవకాశం కల్పిస్తోంది.

PVR Inox Movie Pass: థియేటర్లలో తరచుగా సినిమాలు చూసే వారికి పీవీఆర్‌ ఐనాక్స్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తక్కువ ధరకే ఎక్కువ చిత్రాలు చూసే అవకాశం కల్పిస్తోంది.

సినీ ప్రేక్షకులకు PVR బంపరాఫర్.. రూ.700 లకు నెలంతా సినిమాలు చూసే ఛాన్స్

కళలు, కళాకారుల్ని గౌరవించే.. అభిమానించే.. ఆరాధించే దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా భారతీయులకు సినిమాలంటే అమితమైన పిచ్చి. దేశంలో రోజుకో సినిమా చూడందే నిద్ర పట్టని వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే, థియేటర్లలో సినిమా చూడటం అన్నది ఇప్పుడు ఖరీదైన విషయంగా మారిపోయింది. మధ్య తరగతి కుటుంబం థియేటర్‌లో మూవీ చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అందుకే.. ఎక్కువ మంది ఓటీటీ వైపు మక్కువ చూపిస్తున్నారు.

ఓటీటీ సంస్కృతి పెరిగిపోయిన తర్వాత థియేటర్లలో సినిమాలు చూడ్డం బాగా తగ్గిపోయింది. ఓ నెల ఆగితే ఓటీటీకి వస్తుందిగా అన్న ధీమాతో ప్రేక్షకులు ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసే సంస్కృతి చచ్చిపోతోంది. దీని కారణంగా ఎన్నో థియేటర్లు మూత పడ్డాయి. మరెన్నో థియేటర్లు‍ నష్టాల్లో నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ సినిమా థియేటర్ల యజమాన్యం పీవీఆర్‌ ఐనాక్స్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

watching movies 1 month with 700rs only

 

ప్రేక్షకుల్ని మూవీ థియేటర్లకు రప్పించడానికి సరికొత్త ప్లాన్‌ను అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు మూవీ పాస్‌ విధానాన్ని తీసుకువస్తోంది. ప్రస్తుతం నార్త్‌ ప్రేక్షకులకు మాత్రమే పీవీఆర్‌ మూవీ పాస్‌ విధానం అందుబాటులో ఉంది. ఈ పాస్‌ను సౌత్‌లో కూడా పరిచయం చేసేందుకు సంస్థ సిద్ధం అయింది. పాస్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాస్‌ ధర 699 రూపాయలు ఉంటుంది. నెలకు 10 సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. అయితే, సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే థియేటర్‌లో చిత్రాలు చూసే అవకాశం ఉంటుంది.

పీవీఆర్‌ మూవీ పాస్‌కు సంబంధించి ఇప్పటికే ప్రీ రిజిస్ట్రేషన్‌లు మొదలయ్యాయి. పాస్‌లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై క్లారిటీ లేదు. తరచుగా థియేటర్లలో చిత్రాలు చూసే వారికి పీవీఆర్‌ మూవీ పాస్‌ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సాధారణంగా పీవీఆర్‌ ఐనాక్స్‌ వంటి వాటిల్లో సినిమాలు చూడాలంటే.. మినిమం 200 దాకా ఖర్చు అవుతుంది. ఈ లెక్కన పది చిత్రాల కోసం ఏకంగా 2000 రూపాయలు ఖర్చు చేయాలి. కానీ, పీవీఆర్‌ మూవీ పాస్‌ తీసుకుంటే.. 700 రూపాయలకే 2000 రూపాయల విలువైన సినిమాలను చూడొచ్చు.

ఇప్పుడు థియేటర్లలో నడుస్తున్న సినిమాల విషయానికి వస్తే.. సలార్‌, డంకీ, ఈ రోజు రిలీజైన డెవిల్‌లు ఉన్నాయి. ఈ మూడు చిత్రాలకు థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. సలార్‌ ఇప్పటికే దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. మరి, తక్కువ ధరకే ఎక్కువ సినిమాలు చూసే అవకాశం కల్పిస్తున్న పీవీఆర్‌ ఐనాక్స్‌ మూవీ పాస్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

పీవీఆర్‌ ఐనాక్స్‌ మూవీ పాస్‌ల కోసం.. https://passport.pvrinox.com/లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి