iDreamPost

PVR ఐనా​క్స్‌ సంచలన నిర్ణయం.. ఇకపై అవి కనిపించవు..

  • Published Apr 25, 2024 | 2:13 PMUpdated Apr 25, 2024 | 2:13 PM

పీవీఆర్‌ ఐనాక్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రేక్షకులకు మంచి ప్రయోజనం చేకూరనుంది. ఇంతకు ఆ నిర్ణయం ఏంటి అంటే..

పీవీఆర్‌ ఐనాక్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రేక్షకులకు మంచి ప్రయోజనం చేకూరనుంది. ఇంతకు ఆ నిర్ణయం ఏంటి అంటే..

  • Published Apr 25, 2024 | 2:13 PMUpdated Apr 25, 2024 | 2:13 PM
PVR ఐనా​క్స్‌ సంచలన నిర్ణయం.. ఇకపై అవి కనిపించవు..

సినిమాలు అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్‌ కూడా. ఒకప్పుడు శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల విడుదలతో థియేటర్లు కిటకిటలాడేవి. సినిమా విడుదల రోజు ఫస్ట్‌​ డే ఫస్ట్‌ షోకు వెళ్లడం అనేది చాలా మందికి ప్రెస్టేజ్‌ మ్యాటర్‌గా ఉండేది. అయితే కరోనా తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు కొంత పుంజుకున్నా.. థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య కాస్త తగ్గింది అనే చెప్పవచ్చు. అందుకు కారణం అక్కడ సాగే అడ్డగోలు దోపిడి. ఒకప్పుడు సినిమా చూడాలంటే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌ మాత్రమే ఉండేవి. మారుతున్న కాలంతో పాటు.. థియేటర్ల తీరు కూడా మారింది. ఒకే థియేటర్లో 2,3 సినిమాలు నడుస్తుంటాయి.

మల్టీ స్క్రీన్‌ థియేటర్స్‌ గురించి చెప్పగానే అందరి మదిలో టక్కున మెదిలేది పీవీఆర్‌ ఐనాక్స్‌. దీనికి దేశవ్యాప్తంగా బ్రాంచీలు కూడా ఉన్నాయి. సినిమాల విడుదల వేళ.. ఈ థియేటర్‌ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని వార్తల్లో నిలుస్తుంటుంది. ఇక తాజగా పీవీఆర్‌ ఐనాక్స్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రేక్షకుల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

తమ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూసేందుకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను పెంచేందుకు పీవీఆర్‌ ఐనాక్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా షోలు స్టార్ట్‌ కావడానికి ముందు ప్రదర్శించే యాడ్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజా నిర్ణయంతో ప్రేక్షకులకు యాడ్స్‌ చూసే తలనొప్పి తగ్గి.. ఓన్లీ సినిమానే ఎంజాయ్‌ చేసే అవకాశం కలగనుంది. అయితే పీవీఆర్‌ ఐనాక్స్‌ ఇప్పటికే పలు నగరాల్లోని లగ్జరీ మల్టీప్లెక్స్‌ల్లో యాడ్స్‌ ప్రదర్శనను రద్దు చేసింది. తాజాగా మరికొన్ని చోట్లా అదే విధానాన్ని అమలు చేయాడానికి రెడీ అయ్యింది.

దాదాపు 35 నిమిషాల యాడ్‌ స్లాట్‌ను 10 నిమిషాలకు తగ్గించి.. అదనపు షోస్‌ వేసేందుకు పీవీఆర్‌ ఐనాక్స్‌ ప్రణాళికలు రచిస్తోంది. సినిమా ప్రారంభానికి ముందే కాక.. ఇంటర్వెల్‌ సమయంలోనూ ప్రేక్షకులు యాడ్స్‌ను చూసేందుకు ఇష్టపడట్లేదని.. కేవలం త్వరలో విడుదల కాబోయే చిత్రాల ట్రైలర్లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీవీఆర్‌ ఐనాక్స్‌ సంస్థ ‘ది లగ్జరీ కలెక్షన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌’ చీఫ్‌ రెనాడ్‌ పలియెర్‌ తెలిపారు. పలువురు ప్రేక్షకులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని, ‘యాడ్‌ ఫ్రీ’ విధానం తీసుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా రెనాడ్‌ పలియెర్‌ మాట్లాడుతూ.. ‘‘యాడ్స్‌ని టెలికాస్ట్‌ చేసే సమయాన్ని తగ్గించడం వల్ల సినిమా షోల సంఖ్య పెంచుకునే అవకాశం కలుగుతుంది. యాడ్స్‌ లేకపోవడం వల్ల నష్టం వాటిల్లుతుంది. కానీ, అదనపు షోల వల్ల వచ్చే ప్రేక్షకులు కొనే టికెట్లతో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఇకపై కేవలం సినిమాలు ప్రారంభమయ్యే పది నిమిషాల ముందు మాత్రమే యాడ్స్‌ వస్తాయి. అది కూడా త్వరలోనే రాబోయే కొత్త చిత్రాల ట్రైలర్లను ప్రదర్శిస్తాం. వీటితో పాటు 2, 3 ప్రముఖ బ్రాండ్‌ల యాడ్స్‌ కూడా టెలికాస్ట్‌ చేస్తాం. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర మల్టీప్లెక్స్‌ చైన్‌ (డైరెక్టర్స్‌ కట్‌, ఇన్సిగ్నియా)లో ఈ యాడ్‌ ఫ్రీ అమల్లో ఉంది. త్వరలోనే దీన్ని పుణెలో ప్రారంభిస్తాం. కొన్ని నెలల్లో మరికొన్ని చోట్ల అమలుచేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాం’’ అని వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి