iDreamPost

PV నరసింహారావుకు ‘భారతరత్న’..స్పందించిన పీవీ కుమార్తె!

PV Narasimha Rao: మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుకు కేంద్రం భారత రత్న పురస్కారంను ప్రకటించిన సంగతి తెలిసింది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పీవీకి ఈ అత్యున్నత పురస్కారం దక్కడంపై ఆయన కుమార్తె స్పందించారు.

PV Narasimha Rao: మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుకు కేంద్రం భారత రత్న పురస్కారంను ప్రకటించిన సంగతి తెలిసింది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పీవీకి ఈ అత్యున్నత పురస్కారం దక్కడంపై ఆయన కుమార్తె స్పందించారు.

PV నరసింహారావుకు ‘భారతరత్న’..స్పందించిన పీవీ కుమార్తె!

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న వరించిన సంగతి తెలిసిందే. శుక్రవారం కేంద్ర  ప్రభుత్వం ఆయనతో పాటు మరో ఇద్దరికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. 1991-95 మధ్య పీవీ భారత ప్రధానమంత్రిగా పని చేశారు. సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. పీవీని భారత రత్నపురస్కారం వరించడంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ  విషయంపై పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆనందం వ్యక్తం చేశారు.

మాజీ ప్రధాని, ఏకైక తెలుగు ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించింది. ఇక పీవీకి భారత రత్న రావడంపై ఆయన కుమార్తె, భారాస ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆనందం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా పీవీ సేవలను గుర్తించారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంస్కారానికి ఇది నిదర్శనమని ఆమె కొనియాడారు. ఈరోజు తెలంగాణ శాసనమండలి సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటికి హాజరైన ఆమె..అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. వాణీదేవీ మాట్లాడుతూ…పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంతో ఆ పురస్కారం విలువ పెరిగిందని ఆమె తెలిపారు. పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశం ఆర్థికంగా ప్రమాదపు అంచుల్లో ఉండేదని, ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఉండేలా ఆయన ఆలోచించారని ఆమె చెప్పారు.

మొహమాటం లేకుండా ప్రజా సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా ఆయన జీవించారని,తరతరాలకూ సరిపోయేలా సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత ఆయనదే అని వాణీదేవి చెప్పుకొచ్చారు. దేశానికి అత్యున్నత పురస్కారమైన భారతరత్న పీవీకి దక్కడంపై తెలంగాణ ప్రజలు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.  2021లో శతజయంతి ఉత్సవాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని, దీంతో దేశానికి ఆయన చేసిన కృషి మరింత మందికి చేరువైందని ఆమె తెలిపారు. పీవీ నరసింహారావును గౌరవించుకోవడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమేనని సురభి వాణీదేవి అన్నారు.

ఇక తాజాగా ప్రభుత్వం ప్రకటించిన భారత రత్న పురష్కార విషయాలకి వస్తే.. దేశ చరిత్రలోనే ఒక్కేసారి ఐదు మందికి ప్రకటించడం ఇదే ప్రథమం. మాజీ ప్రధానాలు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథ్, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వాని, కర్పూరీ ఠాకూర్‌లకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది భారతరత్న అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా పీవీ నరసింహరావు చరిత్ర సృష్టించారు. పీవీకి భారతరత్న ప్రకటించడంపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి