iDreamPost

65 ఏళ్ల వయసులో కంప్యూటర్ కోడింగ్ నేర్చుకున్న PV.. ఎలాగంటే?

PV Computer Course: భారతదేశానికి తొమ్మిదవ ప్రధాన మంత్రిగా కొనసాగిన పీవీ నరసింహారావు.. బాహభాషా కోవిదులు మాత్రమే కాదు.. 65 ఏళ్ల వయసులో కంప్యూటర్ రంగంలో తనదైన మార్క్ చాటుకున్నారు.

PV Computer Course: భారతదేశానికి తొమ్మిదవ ప్రధాన మంత్రిగా కొనసాగిన పీవీ నరసింహారావు.. బాహభాషా కోవిదులు మాత్రమే కాదు.. 65 ఏళ్ల వయసులో కంప్యూటర్ రంగంలో తనదైన మార్క్ చాటుకున్నారు.

65 ఏళ్ల వయసులో కంప్యూటర్ కోడింగ్ నేర్చుకున్న PV.. ఎలాగంటే?

పాములపర్తి వేంకట నరసింహారావు అందరూ పీవీ నరసింహారావు అని పిలుస్తారు. న్యాయవాదిగా కొనసాగిన ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. దేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 వరకు పనిచేశారు. ఈ పదవిని అధిష్టించిన మొదటి తెలుగువాడు కావడం మరో విశేషం. అప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన గొప్ప నాయకుడు. బాహుబాషావేత్త, రచయిత మాత్రమే కాదు.. ఆ కాలంలోనే టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేశారు. కంప్యూటర్ కోడింగ్, ప్రోగ్రామింగ్, హార్డ్ వేర్ నేర్చుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆందుకు ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ వచ్చిన పీవీ నరసింహారావు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1957 లో శాసన సభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించి..  ముఖ్యమంత్రి,   ప్రధాన మంత్రిగా కొనసాగారు. తాజాగా పీవీ నరసింహారవుకు భారత ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించింది. రాజకీయాల్లోనే కాకుండా ఆయన గొప్ప కవి, రచయిత, బహుభాషాకోవిదుడిగా తనదైన ముద్ర వేశారు. 1985వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు.. అప్పుడు రక్షణ మంత్రిగా పీవీ కొనసాగారు. వీరిద్దరికీ టెక్నాలజీ అంటే అమిత ఆసక్తి. కాకపోతే ఆ సమయంలో పీవీకి కంప్యూటర్ తో పరిచయం లేదు.. రాజీవ్ గాంధికి మంచి అవగాహన ఉండేది.

1986 లో రాజీవ్ గాంధీ ఓ సందర్భంలో కంప్యూటర్ టెక్నాలజీ గురించి తన మిత్రులతో సంభాషిస్తున్నారు. ఆ సమయంలో పీవీ అక్కడే ఉన్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ చేసినవ్యాఖ్యలు పీవీకీ కంప్యూటర్ నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది. సహజంగానే టెక్నాలజీ అంటే పీవీ ఎంతో ఇష్టపడేవారు.. ఆ సంఘటన తర్వాత కంప్యూటర్ నేర్చుకోవాలనే గట్టిగా నిర్ణయించుకున్నారు. అలా 65 ఏళ్ళ వయసులో పీవీ కంప్యూటర్ నేర్చుకోవడం ప్రారంభించారు. ఇందుకోసం ఆయన కుమారుడు ప్రభాకర్ రావు కి ఫోన్ చేయగా.. వెంటనే ఒక ప్రోటోటైపు కంప్యూటర్‌ని ఢిల్లీకి పంపారు ప్రభాకర రావు. ఆయనకు కంప్యూటర్ నేర్పడానికి ఒక టీచరును కూడా ఏర్పాటు చేశారు. మొదటి నుంచి పుస్తకాల అంటే ఆసక్తి ఉన్న పీవీ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు చదవడం ప్రారంభించారు. అదే పనిగా ఆరు నెలల పాటు ఉదయం, సాయంత్రం కంప్యూటర్ నేర్చుకున్నారు. కంప్యూటర్ కోడింగ్, ప్రోగ్రామింగ్, టీడీపీ ఇలా అన్నింటిపై పూర్తి పట్టు సాధించారు.

పీవీ నరసింహారావు తనయుడు ప్రభాకర్ రావు ఒక సందర్భంలో మాట్లాడుతూ.. ‘మా తండ్రిగారికి ఏదైనా నేర్చుకోవాలాంటే.. దాన్ని పట్టుదలతో సాధిస్తారు. అలా 65 ఏళ్ల వయసులో కంప్యూటర్ కోడింగ్, ప్రోగ్రామంగ్, టీడీపీ ఇలా అన్నింటిపై పట్టు సాధించారు. అప్పట్లో ప్రోగ్రామింగ్ లాంగేజ్వీలు కోబాల్, బేసిక్, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కోడింగ్ రాయడం నేర్చుకున్నారు. అలా ఆరు నెలల్లోనే మొత్తం సీన్ మారిపోయింది.. కంప్యూటర్ సిస్టమ్ గురించి అనర్గళంగా మాట్లాడటం కూడా చేర్చుకున్నారు. నాటి నుంచి మా నాన్నగారు,, రాజీవ్ గాంధీ మధ్య ఖాళీ సమయం వచ్చిందంటే.. టెక్నాలజీపైనే చర్చలు కొనసాగించేవారు, అప్పట్లో మేం కూడా ఆయనతో పోటీపడలేం అన్నారు. అంతేకాదు హార్డ్ వేర్ కూడా నేర్చుకొని కంప్యూటర్ కి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆయనే బాగుచేసుకునేవారు. ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్స్ అప్ డేట్స్ పై కూడా ఆయనకు అవగాహన ఉండేది., మా నాన్నగారి ఆత్మకథ కూడా కంప్యూటర్ లోనే ఫీడ్ చేశారు. తెలుగు లో తర్జుమా చేయడానికి ఆయన తెలుగు డీటీపీ కూడా నేర్చుకున్నారు. ఆయన కంప్యూటర్ రంగంలో ఆ కాలంలోనే ఎన్నో ప్రయోగాలు చేశారు’అని అన్నారు ప్రభాకర్ రావు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి