iDreamPost

అమ్మాయిలకు గుడ్ న్యూస్ ఇకపై ఆ రోజున సెలవు.. కీలక నిర్ణయం

  • Published Apr 14, 2024 | 1:17 PMUpdated Apr 14, 2024 | 1:17 PM

సాధారణంగా పీరియడ్స్ సమయంలో ప్రతిఒక్క మహిళ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా.. అందులో చదువుకునే అమ్మాయిలైతే ఆ సమయంలో పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ సమస్యలను గుర్తించి  తాజాగా దేశంలోని మొదటిసారి పంజాబ్ యూనివర్శిటీ చండీగఢ్ విద్యార్థినుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకి అదేమిటంటే..

సాధారణంగా పీరియడ్స్ సమయంలో ప్రతిఒక్క మహిళ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా.. అందులో చదువుకునే అమ్మాయిలైతే ఆ సమయంలో పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ సమస్యలను గుర్తించి  తాజాగా దేశంలోని మొదటిసారి పంజాబ్ యూనివర్శిటీ చండీగఢ్ విద్యార్థినుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకి అదేమిటంటే..

  • Published Apr 14, 2024 | 1:17 PMUpdated Apr 14, 2024 | 1:17 PM
అమ్మాయిలకు గుడ్ న్యూస్ ఇకపై ఆ రోజున సెలవు.. కీలక నిర్ణయం

ఈ సృష్టిలో ఉండే ప్రతిఒక్క మహిళ జీవనశైలిలో రుతుస్రవం అనేది చాలా సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో ప్రతిఒక్క స్త్రీ శరీరంలో.. హోర్మోన్లు మారుతుంటాయి. దీని వల్ల వారికి చాలా చిరాకు, కోపంగా, మానసికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా.. చదువుకునే అమ్మాయిలు అయితే పీరియడ్స్ సమయంలో పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో వారు భరించే నొప్పి, చదువు పై ఉన్న ఒత్తిడి, పైగా, అసౌకర్యంగా ఉన్న స్కూల్లకు, కాలేజీలకు తప్పనిసరిగా హాజరవ్వలసి ఉంటుంది. అయితే ఇలా ప్రతినెల నెలసరి వచ్చిన సమయంలో.. ప్రతి అమ్మాయి .. ఆఫీసులు, స్కూల్, కాలేజీలు సెలవులు ఇస్తే చాలా బాగున్ను అని ఆలోచిస్తుంటారు. కానీ, దేశంలో స్త్రీలకు అలాంటి రూల్స్ అనేవి ఇప్పటి వరకు ఎక్కడ లేవు. కానీ, తాజాగా మొదటిసారి దేశంలో మహిళ విద్యార్థుల కోసం ఓ కాలేజీలో కీలక నిర్ణయం తీసుకుంది.ఇంతకి అదేమిటంటే..

సాధారణంగా పీరియడ్స్ సమయంలో ప్రతిఒక్క మహిళ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా.. అందులో చదువుకునే అమ్మాయిలైతే ఆ సమయంలో పడే బాధల కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సమస్యలను గుర్తించి  తాజాగా దేశంలోని మొదటిసారి పంజాబ్ యూనివర్శిటీ చండీగఢ్ విద్యార్థినుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, పీరియబడ్స్ సమయంలో ప్రతి విద్యార్థికి సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగాద.. రుతుక్రమ సమయంలో అమ్మాయిలకు సెలవు ఇచ్చే విషయంలో పంజాబ్‌ యూనివర్శిటీ చొరవ  తీసుకోవడంలో ముందుకు వచ్చింది. ఈమేరకు యూనివర్శిటీనే ఈ సమాచారం ఇస్తూ సర్క్యులర్ జారీ చేసింది.

అయితే దీనికి కొన్ని షరతులు కూడా ఆ యూనివర్సిటీ విధించింది. కాగా, 2024-25 వచ్చే విద్యా సంవత్సరం నుంచి  అమ్మాయిలకు కొన్ని  షరతులతో పాటు సెలవు ఇవ్వబడుతుందని తెలిపింది. ఇక  ఈ సెలవు అనేది ఒక రోజు మాత్రమే ఇవ్వబడుతుంది. పైగా ఈ సెలవు తీసుకోవడానికి అమ్మాయిలు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ  ఫారమ్‌ను సమర్పించిన వెంటనే విద్యార్థినికి సెలవు అనుమతి మంజూరు అవుతంది. అంటే క్యాలెండర్ ప్రకారం.. ఒక విద్యార్థి పీరియడ్స్ కారణంగా ఒక నెలలో ఒక రోజు సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక యూనివర్శిటీ నిబంధనల ప్రకారం.. సెమిస్టర్‌కు నాలుగు రోజులు సెలవులు ఇస్తారు. అలాగే అదనంగా మరో సెలవును ఇవ్వనుంది.

కాగా ఆ సెలవులు అనేవి సాధారణ రోజుల్లో మాత్రమే ఉంటుంది. ఇక పరీక్ష సమయంలో బాలిక విద్యార్థులు ఈ సెలవు కోసం దరఖాస్తు చేయలేరు. అలాగే సెలవు అనుమతిని ఛైర్మన్/డైరెక్టర్ ఇస్తారు. అయితే అది విద్యార్థిని స్వీయ ధృవీకరణ ఆధారంగా సెలవు ఇవ్వబడుతుంది. ఇక యూనివర్సిటీ విద్యార్థుల హాజరు, సెలవులను పరిశీలిస్తూ.. నిర్దిష్ట నెలలో ఒక రోజు మాత్రమే సెలవు మంజూరు చేయబడుతుంది. అయితే పంజాబ్ యూనివర్శిటికి ముందు.. కేరళలోని  కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అస్సాంలోని గౌహతి యూనివర్శిటీ, నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా హైదరాబాద్, తేజ్‌పూర్ యూనివర్శిటీ ఆఫ్ అస్సాంలో విద్యార్థినుల అవసరాన్ని బట్టి సెలవులను ఇస్తున్నాయి. మరి, పంజాబ్ యూనివర్శిటిలో పీరియడ్స్ కారణంగా నెలలో ఒకరోజు సెలవు ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి