iDreamPost

OTTలో నుండి తీసేసిన పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..?

కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరణించినా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడాయన. చనిపోయిన తర్వాత ఆయన సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. ఆయన చివరిగా నటించిన మూవీ..

కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరణించినా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడాయన. చనిపోయిన తర్వాత ఆయన సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. ఆయన చివరిగా నటించిన మూవీ..

OTTలో నుండి తీసేసిన పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..?

కరోనా సమయంలో గుండెలు పిండేసిన వార్త ఏదైనా ఉందంటే..అది కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం. యావత్ కన్నడిగులే కాదూ.. దక్షిణాది ఇండస్ట్రీ మొత్తం తమ వాడిని కోల్పోయిందని శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సంగతి విదితమే. ఇక ఆయన చేసిన సేవలు తెలిసి సామాన్యులు సైతం ఫ్యాన్స్ అయిపోయారు. ఇక తన నటనతో మెగా పవర్ స్టార్ అయ్యాడు. అశేషమైన అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. కానీ చిన్న వయస్సులోనే గుండె పోటుతో మరణించాడు. అతడు మరణించి అప్పుడే రెండేళ్లు నిండిపోయాయి. కానీ తన సినిమాలతో ఇంకా అలరిస్తూనే ఉన్నాడు ఈ హీరో.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోక ముందు కొన్ని చిత్రాల్లో నటించారు. అవి ఆయన మరణం తర్వాత విడుదలయ్యాయి. జేమ్స్, లక్కీమ్యాన్, గంధడ గుడి రిలీజ్ అయ్యాయి. ఆయన చివరిగా నటించిన చిత్రం గంధడ గుడి. డాక్యుమెంటరీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం.. 2022 అక్టోబర్‍లో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి హైయ్యర్ రేటింగ్స్ కూడా వచ్చాయి. 10కి 9.3 రేటింగ్ వచ్చింది. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే వెంటనే ఓటీటీలోకి వచ్చినప్పటికీ.. పలు కారణాలతో తొలగించింది. అమెజాన్ ఈ మూవీని తీసేయడానికి కారణం.. టైటిల్ లైసెన్స్ గడువు ముగిసిందని, అందుకే తన ఫ్లాట్ ఫారమ్ నుండి తీసివేయాల్సి వచ్చిందని తెలిపింది.

Puneeth's last movie removed from OTT

ఇప్పుడు ఈ చిత్రం కొన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకు అప్పు (పునీత్ ముద్దు పేరు) చివరగా నటించిన ఈ చిత్రాన్ని ఎక్కడ చూడొచ్చంటే.. గూగుల్ టీవీ, ఐ ట్యూన్, యాపిల్ టీవీ, యూట్యూబ్స్ లో చూడొచ్చు. అయితే ఫ్రీగా కాదూ రెంట్ విధానంలో. ఈ సినిమాను చూడాలంటే రూ. 100 చెల్లించి  వీక్షించవచ్చు. ఇక ఈ సినిమా నిడివి సుమారు గంటన్నర పైన ఉంటుంది. 98 నిమిషాల ఈ డాక్యుమెంటరీ సినిమాను కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఇందులో మరో విశేషమేమిటంటే.. ఆయనే నటిస్తూ నిర్మించారు.  తెలుగు డబ్బింగ్ చిత్రాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. యువరత్న ఇక్కడ మంచి హిట్ అందుకుంది. అలాగే పలు తెలుగు సినిమాల రీమేక్స్ లో నటించి హిట్ అందుకున్నారు. పునీత్ పేరు చెబితే.. ముందుగా గుర్తుకు వచ్చే అంశం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి