iDreamPost

గణేష్ మండపంలో అగ్నిప్రమాదం.. జేపీ నడ్డకు ప్రమాదం!

గణేష్ మండపంలో అగ్నిప్రమాదం.. జేపీ నడ్డకు ప్రమాదం!

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. వాడవాడలా గణేషుడి మండపాలు ఏర్పాటు చేసి.. వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజలు జరుపుతున్నారు. అయితే కొన్నిచోట్ల మండపాల్లో షాట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుణేలోని సానే గురూజీ తరుణ్ మిత్ర మండల్ లో వినాయకుడి హారతి ఇస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాకు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..

పుణె లో సానే గురూజీ తరుణ్ మిత్ర మండల్ లో వినాయకుడి మండపాన్ని ఉజ్జయిని మహాకాళి ఆలయ నమూనాలో ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డ అక్కడికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేస్తుండగా అకస్మాత్తుగా మండపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయి ఆయనను పక్కకు తీసుకువెళ్లారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలోనే భారీ వర్షం పడటంతో మంటలు వెంటనే ఆర్పివేశారు.

జేపీ నడ్డా ప్రత్యేక పూజల కోసం మండపానికి రావడంతో కొంతమంది కార్యకర్తలు బాణాసంచా పేల్చడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని గణేష్ మండప నిర్వాహకులు తెలిపారు. ఆ సమయంలో జేపీ నడ్డాతో పాటు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షులు చంద్ర శేఖర్ భావాంకులే కూడా అక్కడే ఉన్నారు. కాగా, ఈ మండపాన్ని పుణె నగర బీజేపీ అధ్యక్షులు ధీరజ్ ఘాటే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి