iDreamPost

వీడియో: రామ్‌లీలా నాటకంలో సిగరెట్‌ తాగిన సీత పాత్రదారి!.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

రామ్ లీలా నాటకంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సీత పాత్రదారి స్టేజీపైనే సిగరెట్ తాగడం తీవ్ర కలకల రేపింది. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఏం జరిగిందంటే?

రామ్ లీలా నాటకంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సీత పాత్రదారి స్టేజీపైనే సిగరెట్ తాగడం తీవ్ర కలకల రేపింది. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఏం జరిగిందంటే?

వీడియో: రామ్‌లీలా నాటకంలో సిగరెట్‌ తాగిన సీత పాత్రదారి!.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

రామాయణ గాథను వినిపించేందుకు నాటకాలను ప్రదర్శించడం మనం చూశాం. కోదండ రాముడిని ఎంత భక్తితో కొలుస్తారో రామాయణ గాథను కూడా అంతే భక్తితో జనులందరికి అర్థమయ్యే విధంగా నాటకాలు ప్రదర్శిస్తుంటారు. రామ్ లీలా నాటకాన్ని వీక్షించే ప్రేక్షకులు సైతం భక్తిభావంతో తన్మయత్వం చెందుతుంటారు. అయితే నాటకంలో పాల్గొనే పాత్రదారులు చేసే వెకిలి చేష్టల వల్ల భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఓ యూనివర్సిటీలో రామ్ లీలా నాటకాన్ని ప్రదర్శించగా.. సీత పాత్రదారి స్టేజ్ పైననే సిగరెట్ తాగుతూ కనిపించింది. దీంతో పవిత్రమైన రామ్ లీలా నాటకంలో సిగరెట్ తాగడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

మహారాష్ట్రలోని పూణేలో సావిత్రీబాయి పూలే యూనివర్సిటీలోని లలిత కళా వేదికపై శుక్రవారం రామ్‌ లీలా నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. నాటకం జరుగుతుండగా.. సీత పాత్రదారి స్టేజీపైనే సిగరెట్ తాగడం అందరినీ విస్మయానికి గురిచేసింది. సీత పాత్రదారి సిగరెట్ నోట్లో పెట్టుకోగా రాముడి పాత్రలో ఉన్న వ్యక్తి ఆ సిగరెట్ ను వెలిగించాడు. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సిగరెట్ తాగడమే కాదు.. అభ్యంతరకరమైన రీతిలో డైలాగులు ఉండడంతో పెద్ద దుమారమే రేగింది. రామ్ లీలా నాటకంలో ఇలాంటి పిచ్చి పనులు చేయడమేంటని దీనికి పాల్పడిన వారిపై మండిపడుతున్నారు.

ఇక ఈ ఘటనపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విద్యార్థులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏబీవీపీ విద్యార్థులు, హిందూ సంఘాలు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీలో సిగరెట్ తాగడమే తప్పు.. అందులో రామ్ లీలా నాటకంలో సీత పాత్రదారి స్మోక్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇక దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లలిత కళా కేంద్రం విభాగాధిపతి అయిన ప్రొఫెసర్‌ డాక్టర్ ప్రవీణ్ భోలే, నాటకం పాత్రధారులైన విద్యార్థులు భవేష్ పాటిల్, జే పెడ్నేకర్, ప్రథమేష్ సావంత్, రిషికేష్ దాల్వీ, యశ్ చిఖ్లేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరి రామ్ లీల నాటకంలో సీతపాత్రదారి సిగరెట్ తాగిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి