iDreamPost

ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా? తెలుగులో ఒక వెలుగు వెలిగింది!

ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా? తెలుగులో ఒక వెలుగు వెలిగింది!

తెలుగు సినిమాలో హీరోలకు ఎంత కల్ట్ ఫ్యాన్స్ ఉంటారో.. అలాగే హీరోయిన్స్ కి కూడా అదే ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒకసారి వారికి నచ్చింది అంటే ఇంక ఆమెను దేవతలా పూజిస్తారు. సినిమాలు చేస్తున్నా.. చేయకపోయినా.. అసలు ఇండస్ట్రీలో లేకపోయినా కూడా ఫాలో అవుతూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ కూడా అలాంటి ఒక స్టార్డమ్ సొంతం చేసుకుంది. తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారింది.

ఒక్క తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇంక సోషల్ మీడియాలో అయితే అటు బోల్డ్ ఫొటోషూట్స్.. ఇటు ఆధ్యాత్మికం పోస్టులతో అలరిస్తుంటుంది. మనసులో ఏది అనిపిస్తే ముక్కుసూటిగా అది చెప్పేస్తూ ఉంటుంది. ఏంటి.. ఇన్ని హింట్స్ ఇచ్చినా కూడా ఇంకా గుర్తు పట్టలేదా? ఆ ఫొటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు.. అమలాపాల్. ప్రస్తుతం వెకేషన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

అమలాపాల్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు తక్కువ సినిమాలే చేసింది. 2021లో పిట్ట కథలు అనే నెట్ ఫ్లిక్స్ డైరెక్ట్ ఓటీటీలో నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో చేయలేదు. ఇటీవలే హిందీలో కూడా డెబ్యూ చేసింది. నిర్మాతగా కూడా రాణిస్తోంది. కడవర్ పేరిట చేసిన మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టుమార్టం చేసే ఒక డాక్టర్ పాత్రలో అమలాపాల్ మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంటోంది. మలయాళంలో రెండు, తమిళ్ లో రెండు సినిమాలు చేస్తోంది. మళ్లీ తెలుగులో ఎప్పుడు మూవీ చేస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడల్లా ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

మూవీస్ లోనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా అమలా పాల్ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూనే ఉంటుంది. తాను ఎక్కడ ఏ వెకేషన్ కి వెళ్లినా కూడా ఆ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. కొన్నాళ్ల నుంచి బోల్డ్ ఫొటోషూట్స్ తో కుర్రకారును తెగ ఇబ్బంది పెడుతోంది. అంతేకాకుండా జీవితంలో ఆధ్యాత్మికత చింతనను కూడా పెంచుకుంటోంది. ధ్యాన కేంద్రాలు, పురాతన దేవాలయాలు, ఆశ్రమాలు, అడవులు పట్టుకుని తిరుగుతోంది. లైఫ్ లో ప్రస్తుతం అమలాపాల్ తన కంపెనీని తాను బాగా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి