iDreamPost

Dil Raju: నిర్మాత దిల్ రాజు ఆగ్రహం.. తప్పుడు రాతలు రాస్తే తాటతీస్తానంటూ..

సంక్రాంతి అనగానే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈసారి సినిమాల కంటే ముందు వాటిపై జరుగుతున్న చర్చే ఎక్కువగా ఉన్నాయి.

సంక్రాంతి అనగానే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈసారి సినిమాల కంటే ముందు వాటిపై జరుగుతున్న చర్చే ఎక్కువగా ఉన్నాయి.

Dil Raju: నిర్మాత దిల్ రాజు ఆగ్రహం.. తప్పుడు రాతలు రాస్తే తాటతీస్తానంటూ..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. తెలుగు ప్రజలకు సంక్రాంతి అంటే థియేటర్లలో మంచి సినిమా కూడా చూడాల్సిందే. ఈసారి సంక్రాంతి బరిలోకి మొత్తం 4 బడా చిత్రాలు దిగుతున్నాయి. మహేశ్ గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్ మూవీలు బరిలోకి దిగుతున్నాయి. జనవరి 12న గుంటూరు కారం, హునుమాన్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఒకేరోజు 2 చిత్రాలు విడుదల ఉండటంతో థియేటర్ల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఒక సినిమాకే ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ అప్పజెప్పారంటూ విమర్శలు వచ్చాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీద కూడా కొన్ని విమర్శలు, వార్తలు వచ్చాయి. అలాంటి వాటిపై దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు.

“నేను కష్టపడి ఎదిగి ఈ పొజిషన్ లో ఉన్నందుకు.. ప్రతి సంక్రాంత్రికి కాంట్రవర్సీలు చేస్తూ నాపై రాళ్లు వేస్తూనే ఉంటారు. ఇది 8 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. నిన్న చిరంజీవి గారు మాట్లాడుతూ ఎంత బాగా చెప్పారు. దిల్ రాజుకు తెలుసు ఏ కంటెంట్ కి ఎలా ఇవ్వాలో.. వెల్ ఎక్స్ పీరియన్స్డ్ పర్సన్ అని చెప్పారు. కొన్ని వెబ్ సైట్స్ ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి రెండూ ప్రముఖ వెబ్ సైట్లే. మీరు నాపై ఏదో రాసి మీ వెబ్ సైట్స్ ఇపార్టెన్స్ పెంచుకోవడానికి ఎందుకు వాడుకుంటున్నారు. అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు.. సాఫ్ట్ గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా.. చాలారోజులుగా ఓపిక పడుతున్నాను. ఎందుకు ఎందుకు సాఫ్ట్ గా వెళ్దామని. సంబంధం లేకుండా. ఆ ప్రొడ్యూసర్ ఏమైనా మాట్లాడాడా? మీకు దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ ని పిలిపించి స్టేజ్ మీద కూర్చోబెట్టి నాకు క్వశ్చన్స్ వేయించండి.

ఎందుకు ప్రతి సంక్రాంత్రికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంత మంది నన్ను అభిమానిస్తున్నారు కదా? 95 శాతం మంది నన్ను అభిమానిస్తున్నారు. మిగిలిన 5 పర్సంట్ ఇష్ట పడతారా? ఇష్టపడరా? అనేది వాళ్ల ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ శాటిస్ఫై చేయలేను. మీ అందరికీ తెలుసు.. దిల్ రాజు అంటే ఒక బ్రాండ్ గా బిల్డ్ చేశాను. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్సీలను అడ్వాంటేజ్ గా తీసుకుని.. మీ వెబ్ సైట్స్, మీ యూట్యూబ్ ఛానల్స్ కి వాడుకుంటున్నారు. అది తప్పు. ఛాంబర్లో మీటింగ్ పెట్టి రవితేజ గారిని కన్విన్స్ చేశాం. ఇప్పుడు ఒకడు దిల్ రాజు తమిళ్ సినిమా రిలీజ్ చేస్తున్నాడు అంటూ రాశాడు. ఎవడు చెప్పాడ్రా నీకు? ఎవడు చెప్పాడు? ఆ తమిళ్ సినిమా కూడా పోస్ట్ పోన్ చేయించింది నేను. తెలుగులో రిలీజ్ వద్దు అని చెప్పా. ఇందాక నేను తాటతీస్తాను అన్నది.. ఈజీగా తీసుకోవద్దు. నాపై తప్పుడు రాతలు రాస్తే నేను ఊరుకోను. హనుమాన్ సినిమా రిలీజ్ ఆపాలని చూశాను అని రాశారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ ని పిలింపించి అడగండి. నేను 14 వ తారీఖు రిలీజ్ చేయండి అని అడిగాను. జనవరి 12న గుంటూరు కారం సినిమా ఉంది. కాబట్టి 14 అయితే మీ మూవీకే ఉపయోగం అని చెప్పాను. దానిని ఇంకొకలాగా మార్చి రాస్తున్నారు.

నెగిటివ్ వైబ్స్ ఉండకుండా.. పాజిటివ్ గా బతికితే బాగుంటుంది. అందరం పోయోవాళ్లమే. నెగిటివ్ వైబ్స్ ఎందుకు? మీ వెబ్ సైట్స్, ఛానల్స్ డెవలప్ అవ్వాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారా? నైజాంలో 8 సెంటర్లలో మహేశ్, హనుమాన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వెంకటేశ్, నాగార్జున గారి సినిమాలకు థియేటర్లు లేవు. అంత ఇమేజ్ ఉన్న వాళ్లకు కూడా థియేటర్లు లేవు. ఇవన్నీ మీకు కనిపియ్యవు. ఎంతసేపు వాళ్లకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ.. ఈ రోజు కొన్ని కోట్లు ఖర్చుపెట్టినా రాని ప్రమోషన్ హనుమాన్ సినిమాకి వచ్చింది. చిన్న సినిమా.. అది సూపర్ హిట్ అవ్వాలని కోరుకునే వారిలో నేను కూడా ఒకడిని. సినిమా ఆడితేనే గ్లోబల్ గా పెరుగుతాం. ఇవి తెలియకుండా మీ పిచ్చి రాతలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? తప్పుగా నా పేరు పెట్టి రాస్తే తాటతీస్తా. ఇదిలా ఉంది.. ఏంటి అని అడగండి. నేను క్లారిటీ ఇస్తాను” అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి