iDreamPost

Dil Raju: సంక్రాంతికి వచ్చేది ఎవరు? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

సంక్రాంతి అనగానే టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు సిద్ధమైపోతాయి. ఈసారి పండగకు 5 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో ఏ మూవీస్ రిలీజ్ అవుతాయంటే..

సంక్రాంతి అనగానే టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు సిద్ధమైపోతాయి. ఈసారి పండగకు 5 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో ఏ మూవీస్ రిలీజ్ అవుతాయంటే..

Dil Raju: సంక్రాంతికి వచ్చేది ఎవరు? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

తెలుగువారికి సంక్రాంతి ఎంతో ముఖ్యమైన పండుగ. ఎక్కడెక్కడో స్థిరపడిన పోయిన తెలుగువాళ్లు తిరిగి సొంతూరుకు చేరుకుంటారు. సొంతవారితో ఆనదంగా గడుపుతారు. మొదటి నుంచి తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి అనగానే పిండివంటలు, కోడిపందేలు, గాలిపటాలు ఎలాగో.. సినిమాలు కూడా అలాగే. పండగ అనగానే కుటుంబంతో కలిసి ఒక్క సినిమా అయినా చూడాల్సిందే. అందుకే టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది కూడా ఏకంగా 5 సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. ఈ పోటీలో సంక్రాంతికి వచ్చేది ఎవరు? ఆగేది ఎవరు? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సంక్రాంతి రిలీజుల గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఫలానా సినిమా రిలీజ్ అవుతుందంట.. ఫలానా హీరో సినిమా రిలీజ్ కావట్లేదంట. ఆ నిర్మాత వెనక్కి తగ్గాడంట అంటూ చాలానే వార్తలు వస్తున్నాయి. వీటన్నింటిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియాతో ముచ్చటించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క సినిమా వెనక్కి తగ్గినా మిగిలిన నాలుగు సినిమాలకు మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. ముందుగా తన సినిమానే వాయిదా వేసుకున్న నేపథ్యంలో నిర్మాతలు ఆయన్నే చర్చలు జరపాలంటూ కోరారంట. ఇప్పటికే సంక్రాంతి రిలీజులకు సంబంధిచి అందరు నిర్మాతలతో చర్చలు జరిపామన్నారు. వీలైనంత వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు.

ఏ సినిమాని పోస్టు పోన్ చేసుకోమని తాము మాత్రం చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరికనై సాధ్యాసాధ్యాల గురించి మాత్రమే చెప్పామన్నారు. ఒక నిర్మాతకు తన పెట్టుబడి, దానిని రికవర్ చేసుకునేందుకు కొన్ని అంచనాలు ఉంటాయని.. వాటికి అనుగుణంగా వాళ్లు నిర్ణయం తీసుకుంటారన్నారు. తాను మాత్రం ఎవరికైనా సలహా మాత్రమే ఇచ్చానని.. వాయిదా నిర్ణయం పూర్తిగా వారికే వదిలేశామన్నారు. ఇప్పుడు రేసు నుంచి తప్పుకునే నిర్మాతలకు సింగిల్ రిలీజ్ డేట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. వారి మూవీ రిలీజ్ ఉన్న సమయంలో ఏ చిత్రాలు పోటీకి రాకుండా ఉండేలా చూస్తామన్నారు. అలాగే ఏ సినిమాలు కచ్చితంగా రిలీజ్ అవుతాయనే ప్రశ్నకు.. గుంటూరు కారం వాళ్లు ఎప్పుడే అనౌన్స్ చేశారు కాబట్టి.. వారి మూవీ కచ్చితంగా సంక్రాంతికి వస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. అలాగే మిగిలిన నాలుగు సినిమాల్లో ఎవరైనా పోస్టు పోన్ చేసుకుంటారా అనే విషయంపై మరో రెండ్రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు.

“ఒక్కో ఏరియాలో మూడు థియేటర్లే ఉంటాయి. అప్పుడు 5 సినిమాలు రిలీజ్ చేస్తే మిగిలిన రెండు సినిమాల పరిస్థితి ఏంటి? సంక్రాంతికి రిలీజ్ చేస్తే లాభాలు వస్తాయని మా నిర్మాతలకు ఒక ఆశ ఉంటుంది. అందుకే అందరు నిర్మాతలు సంక్రాంతికే రావాలి అనుకుంటారు. నేను ముందుగా నా సినిమాని వాయిదా వేసుకున్నాను. నేను సమ్మర్ కి ప్లాన్ చేసుకుంటున్నాను. ఎవరికీ నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చర్చలు జరిపాం. ఎవరైనా రిలీజ్ వాయిదా వేసుకుంటే.. వారికి సింగిల్ రిలీజ్ డేట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తాం” అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఇంక సంక్రాంతి సినిమాల విషయానికి వస్తే.. మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, రవితేజ ఈగల్, నాగార్జున నాసామిరంగ, వెంకేటశ్ సైంధవ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఎవరు రిలీజ్ చేస్తారు? ఎవరు వాయిదా వేస్తారు అనే విషయంపై మరో రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి.. సంక్రాంతి రిలీజుల విషయంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి