iDreamPost

దిల్ రాజు గోల్డెన్ టచ్

టాలీవుడ్ నిర్మాతల్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ముద్ర పడ్డారు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనేక సినిమాలను తెరకెక్కించారు. ఆయన చేసిన సినిమాలు, సాధించిన విజయాలు, బాక్సాఫీసు రికార్డులు, కలెక్షన్లు అన్నీ ఇన్నీ కావు.

టాలీవుడ్ నిర్మాతల్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ముద్ర పడ్డారు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనేక సినిమాలను తెరకెక్కించారు. ఆయన చేసిన సినిమాలు, సాధించిన విజయాలు, బాక్సాఫీసు రికార్డులు, కలెక్షన్లు అన్నీ ఇన్నీ కావు.

దిల్ రాజు గోల్డెన్ టచ్

నిర్మాతలలో దిల్ రాజు సాధించినంత సక్సెస్ గత రెండు దశాబ్దాలలో మరే నిర్మాత సాధించలేదంటే అతిశయోక్తి కానేకాదు. ఆయన తీసిన సినిమాలు, అవి సాధించిన విజయాలు, రికార్డులు, బాక్సాఫీసు కలెక్షన్లు..ఇవన్నీ దిల్ రాజు సక్సెస్ ట్రాక్ కి సైన్ పోష్టులు. గత ఏడాది నుంచి చూస్తే దిల్ రాజు టచ్ చేసిన సినిమాలు బింబిసార, జైలర్, పిఎస్ వన్, పిఎస్ టు, లవ్ టుడే, దసరా, ప్రస్తుతం యానిమల్..వేటికవే తిరుగులేని సక్సెస్ సాధించాయి. మొత్తం మీద ఏపి తెలంగాణలలో దిల్ రాజుదే టోటల్ హవా. సినిమాని ఫ్యాషన్ గా కాకుండా పేషన్ గా తీసుకున్న నిర్మాత కాబట్టే ఇన్ని సక్సెస్ లు కొట్టగలుగుతున్నారు దిల్ రాజు అనే ట్రేడ్ రెస్పక్ట్ ని కూడా దిల్ రాజు సాధించగలిగారు. దిల్ రాజుకి ఫెయిల్యూర్ వస్తే అది న్యూస్ అన్నట్టు అయిపోయింది. సక్సెస్ లు, హిట్లు దిల్ రాజు ఇంటిపేర్లలా తయారయ్యాయి. 2023 సంవత్సరం పూర్తిగా దిల్ రాజుకే అంకితమైపోయిందా అనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఏపి, తెలంగాణలో పంపిణీ చేసిన యానిమల్ బాక్సాఫీసు రెవిన్యూ చూస్తే.. ఆ మూవీ క్రియేట్ చేసిన దుమారం అర్ధమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజే అక్షరాల 14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది యానిమల్. మూడురోజులు గడిస్తే ముప్ఫై, ముప్ఫై ఐదు కోట్లకు గ్రాస్ ఫిగర్స్ చేరిపోతాయన్నది మన ఎక్స్ పర్ట్ దిల్ రాజు అంచనా. ఆశ్చర్యం లేదు. ఎందుకంటే యానిమల్ ఫీవర్ పరాకాష్టకు చేరుకుంది. పదిరోజులకి 50 కోట్లకు చేరుతుందన్నది కూడా కనిపిస్తున్న లెక్క. దిల్ రాజు మాటల్లో చెప్పాలంటే ‘’పిచ్చెక్కితే సినిమా ఎలా తీస్తారో అలా ఉంది యానిమల్’’

థాంక్స్ టు తెలుగు ఆడియన్స్

‘’ఇది కేవలం సందీప్ వంగాకి మాత్రమే సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా హిట్ కావడం వేరు. కానీ తెలుగు దర్శకుడు అక్కడికి వెళ్ళి బాలీవుడ్ హీరోతో సినిమా తీసి తెలుగు రాష్ట్రాలలో ఇంత సంచలనం తీసుకురావడమే ఇందులో గొప్పతనం. మన తెలుగు హీరోలు రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీ ఆర్ ఎలా అయితే బాలీవుడ్లో సక్సెస్ అవుతున్నారో అలా అనమాట. మొన్ననే షారుఖ్ ఖాన్ సినిమా జవాన్, ఇప్పుడు యానిమల్. వాళ్ళకి కూడా ఇక్కడ ఆదరణ లభించడమన్నది ప్రారంభమైంది. సినిమా ఇండస్ట్రీ అన్నది గ్లోబల్ అయిందని నమ్ముతున్నాం. అది నిజమైందిప్పుడు. సో….ఆడియన్స్ కంటెంటె బావుంటే ఏ లాంగ్వేజ్ ఫిల్మ్ అయినా, ఏ హీరోతో వచ్చినా చూడ్డానికి సిద్ధంగా ఉన్నారన్నది అర్ధమవుతోంది. థాంక్స్ తెలుగు ఆడియన్స్.’’ అని చెప్పారు దిల్ రాజు.

2017లో లాగే 2024

సంక్రాంతికి సైంధవ్, గుంటూరు కారం నైజాంలో పంపిణీ చేయనున్నట్టుగా చెబుతూ, వైజాగ్ లో సైంధవ్ చేయబోతున్నట్టుగా దిల్ రాజు తెలియజేశారు. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికే విడుదల చేద్దామని అనుకున్నా కూడా అమెరికా వీసాలు ఆలస్యమైన కారణంగా కొంత జాప్యం జరిగిందని చెబుతూ, అమెరికా షెడ్యూల్ ముగించుకుని వచ్చాక కూడా మరో షెడ్యూల్ పూర్తి చేసుకుని మార్చిలో రిలీజ్ కి సిద్ధం చేస్తామని చెప్పారు. ఎస్ వి సిలో 4 సినిమాలు, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో మరో మూడు సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయని, వాటిని విజయదశమిలోగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా దిల్ రాజు వెల్లడించారు. 2017 సంవత్సరంలో లాగే 2024లో కూడా నెంబరాఫ్ ఫిల్మ్స్ విడుదల చేసే అవకాశం తమకుందని కూడా చెప్పారు. వీటితో ఎలా సక్సెస్ కొట్టాలని చూస్తున్నామని, అదే పెద్ద ఛాలెంజ్ అని, అన్నీ హిట్ కొట్టడానికే చూస్తామని, కానీ వాటిల్లో ఎన్ని ఆడియన్స్ ని రీచ్ అవుతాయనేదే వేచి చూడాలని అన్నారు.

గేమ్ ఛేంజర్ డేట్ లాక్ చెయ్యలేం

రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో జరుగుతున్న సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దిల్ రాజు మాట్లాడుతూ, శంకర్, సుకుమార్, రాజమౌళి, ఇప్పుడు సందీప్ వంగా వీళ్ళ సినిమాలు ముందుగానే రిలీజ్ డేట్స్ లాక్ చెయ్యలేమని అన్నారు. ‘’ వాళ్ళు సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరకూ తీస్తూనే ఉంటారు. సందీప్ యానిమల్ నాలుగేళ్ళు తీశాడు. గేమ్ ఛేంజర్ షెడ్యూల్ మైసూర్ లో పదిహేను రోజులు జరిగింది. డైరెక్టర్ మొన్న కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభించి, మర్నాడు పదిన్నర వరకూ తీస్తూనే ఉన్నారు శంకర్. మాకు తెలుసు. చాలా హార్ఢ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళనుకున్నది రావాల్సిందే .అప్పుడే మాకు రిలీజ్ డేట్ ఇస్తారు. దాని ప్రకారం మేం పోస్ట్ ప్రొడక్షన్ టైం బట్టి అప్పుడు రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకోవాలి తప్పితే ముందుగా కుదరదు. ముందైతే షూటింగ్ ఫాస్ట్ గా పూర్తి చేయాలని డైరెక్టర్ గారు వర్క్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారి నెక్ట్స్ సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది. సినిమా అయితే ఫినిషింగ్ లోకి వచ్చేశాం 80 పర్సంట్ పూర్తయిపోయింది.’’ అని తెలియజేశారు.

రజనీకాంత్, అజిత్ తో సినిమాలు..?
రజనీకాంత్ ,అజిత్ తో సినిమాల గురించి దిల్ రాజు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఏడు సినిమాలు, ప్రొడకన్, రిలీజులు అవన్నీ ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నామని, అన్ని సినిమాలు ఉంటాయని, వాటికి సంబంధించిన కథల ప్రక్రియ జరుగుతోందని మాత్రమే చెప్పారు.

మూడున్నర గంటల సినిమాలు కొత్తకాదు మనకి
యానిమల్ సినిమా విజయం గురించి మాట్లాడుతూ జనంకి నచ్చితే ఎంత గొప్ప ఓపెనింగైనా ఇస్తారని, అందుకు యానిమల్ సినిమాయే ప్రత్యక్ష నిదర్శమని అన్నారు. మూడున్నర గంటల లెంత్ గురించి మాట్లాడుతూ తానైతే బిజినెస్ లెక్కల ప్రకారం అంత లెంత్ లో సినిమాలు తీయనని, అందుకే సందీప్ తనతో చెయ్యడని నవ్వుతూ చెప్పారు దిల్ రాజు. ‘’మనకి గతంలో కూడా సర్దార్ పాపారాయుడు, దానవీరశూర కర్ణ వంటి సినిమాలు అంత లెంత్ లో వచ్చాయి, పెద్ద హిట్లు అయ్యాయి. ఇప్పుడు యానిమల్ మల్టీప్లెక్స్ లో నాలుగు షోలే వేయగలుగుతున్నాం. అది మాకు బిజినెస్ పరంగా వర్కవుట్ అవదు. మేం చెయ్యం. అందుకే సందీప్ మాతో చెయ్యడు. తను అనుకున్నట్టుగానే చేస్తాడు. సక్సెస్ కొట్టాడు.’’ అన్నారు.

యానిమల్ లాంటి వయొలెన్స్, న్యూడిటీ ఉన్న సినిమాలు మీరు ఎస్వీసి బ్యానర్ పైన చేస్తారా అన్న ప్రశ్నకు దిల్ రాజు సమాధానం చెబుతూ’’ యస్ . తప్పకుండా తీస్తాను. 20 ఏళ్ళ క్రితం బొమ్మరిల్లు తీశాను. దిల్ రాజు ఫ్యామిలీ డ్రామా సినిమాలు తీస్తాడని బ్రాండ్ వేశారు. ఇప్పుడు యానిమల్ లాంటి పినిమాలు తీసే ముందుగానే స్టేట్ మెంట్ ఇచ్చి మరీ తీస్తాను. ఇదిగో..ఈ డైరెక్టర్ ఇలా కథ అనుకుంటున్నాడు..ఈ సినిమా నేను తీస్తున్నాను అని చెప్పి మరీ చేస్తాను. మరి యానిమల్ చూస్తున్నారు కదా. అంత పెద్ద రెవిన్యూ ఇస్తున్నారు కదా. ఏదో అంటారు కదా..చూసేవాళ్ళు రెడీగా ఉన్నప్పుడు తీసే వాళ్ళకేంటి ప్రాబ్లమ్’’ అన్నారు నవ్వుతూ.

 

– నాగేంద్ర కుమార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి