iDreamPost

ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన దిల్‌ రాజు నిర్మాణ సంస్థ!

ఆ వార్తల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరూ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి...

ఆ వార్తల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరూ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి...

ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన దిల్‌ రాజు నిర్మాణ సంస్థ!

టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఓ కొత్త ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను మొదలుపెట్టబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి ‍ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే ఆ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ప్రారంభం కానుందని మీడియా, సోషల్‌ మీడియా వ్యాప్తంగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల ప్రకారం… దిల్‌ రాజు కంటెంట్‌ క్రియేషన్‌ మీద దృష్టిపెట్టారట. దాదాపు 25 చిన్న సినిమాలు తీయడానికి సిద్ధమయ్యారట. ఇందుకోసం మరికొంతమంది నిర్మాతలతో ఆయన చెయ్యి కలపబోతున్నారట.

స్వయంగా ఆయనే భాగస్వాములతో సినిమాలు కలిసి నిర్మించి.. థియేటర్ రిలీజ్ తర్వాత డైరెక్ట్ గా తమ సొంత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చనే భారీ ప్లాన్ తో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై దిల్‌ రాజు నిర్మాత సంస్థ తాజాగా క్లారిటీ ఇచ్చింది. తమ నిర్మాత దిల్‌రాజు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను మొదలుపెట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ఈ మేరకు ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘‘ మా సంస్థ నిర్మాత దిల్‌ రాజు త్వరలో ఓ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ను తీసుకురాబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఆ వార్తల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరూ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి’’ అని రాసుకొచ్చింది. కాగా, కరోనా టైంలో ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌లకు ఆధరణ బాగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనం ఓటీటీల్లోని వివిధ దేశాలకు, భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను చూడ్డానికి అలవాటు పడ్డారు. దీంతో సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడ్డం బాగా తగ్గిపోయింది. నేరుగానో.. కొద్దిరోజుల తర్వాతో సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి