iDreamPost

నెల్లూరు వస్తా.. ఆ సాక్ష్యాధారాలన్ని పోలీసులుకు అందిస్తా: ప్రియా పొంగూరు

  • Published Mar 05, 2024 | 12:34 PMUpdated Mar 05, 2024 | 12:34 PM

మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదుల ప్రియా పొంగూరు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూముల లావాదేవీలకు సంబంధించిన సాక్ష్యాధారాలన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదుల ప్రియా పొంగూరు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూముల లావాదేవీలకు సంబంధించిన సాక్ష్యాధారాలన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

  • Published Mar 05, 2024 | 12:34 PMUpdated Mar 05, 2024 | 12:34 PM
నెల్లూరు వస్తా.. ఆ సాక్ష్యాధారాలన్ని పోలీసులుకు అందిస్తా: ప్రియా పొంగూరు

ఎన్నికల ముందు టీడీపీ నేతలకు ఊహించని షాకులు తగులుతున్నాయి. అమరావతి రాజధాని పేరుతో వారు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక తాజాగా మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేట్‌ సంస్థతో కలిసి నారాయణ తన విద్యా సంస్థల పేరు చెప్పుకుని ప్రభుత్వాన్ని ఎలా మోసం చేశారో వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగానే మాజీ మంత్రి నారాయణ మరదలు ప్రియ మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. రాజధాని భూముల పేపర్లు రెండు బస్తాలు వారి ఇంట్లోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు ప్రియ.

ఈమేరకు ప్రియ ఒక వీడియో రిలీజ్‌ చేశారు. దీనిలో ఆమె మాట్లాడుతూ.. నారాయణ భూముల పేపర్‌ తమ ఇంట్లోనే 3 రోజులు ఉన్నాయి. ఎవరెవరి పేరిటి భూములు కొన్నారో.. బినామీలు ఎవరో తనకు బాగా తెలుసు అన్నారు. దీని గురించి త్వరలోనే అన్ని వివరాలు మీడియాకు వెళ్లడిస్తాను అన్నారు. నెల్లూరుకు వచ్చి.. ఎస్పీ, మీడియా, వైసీపీ మంత్రి విజయసాయిరెడ్డని కలుస్తానని.. భూములకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెడతాను అని చెప్పుకొచ్చారు. అంతేకాక తాను అందించే సాక్ష్యాలు సీబీసీఐడీకి ఉపయోగపడతాయి అన్నారు ప్రియ.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోతంది.

ఇక ఎన్‌స్పైర మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ కంపెనీని అడ్డుపెట్టుకుని.. నారాయణ చేస్తోన్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కంపెనీ పేరు చెప్పుకుని నారాయణ నల్లధనాన్ని తరలిస్తున్నాడని వెల్లడయ్యింది. తాజాగా మాజీ మంత్రి నారాయణ అల్లుడు ఏకంగా పది కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలిసింది. ఇన్‌స్పైర్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టినట్లు వెల్లడయ్యింది. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. రూ.10 కోట్ల 32 లక్షలు బకాయి ఉంది. అంటే 84 వాహనాలకు సంబంధించి కేవలం రూ. 22 లక్షల మాత్రమే జీఎస్టీ కట్టి.. మిగతా పది కోట్ల రూపాయలు ఎగొట్టారని తెలుస్తోంది. మరి ప్రియ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి