iDreamPost

Prematho Raa.. :ప్రేమ పండక హిట్లకు బ్రేక్ వేసిన రా

ఆ టైంకి ప్రముఖ నిర్మాత టి త్రివిక్రమరావుకు ఓ సినిమా బాకీ ఉన్నారు వెంకటేష్. కథ కోసం వెతుకుతున్న తరుణంలో ప్రముఖ రచయిత భూపతిరాజా చెప్పిన స్టోరీ నచ్చేయడంతో దాన్నే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. కలిసుందాం రా హ్యాంగోవర్ తీవ్రంగా ఉండటంతో ఆ కాంబోనే మళ్ళీ రిపీట్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆ టైంకి ప్రముఖ నిర్మాత టి త్రివిక్రమరావుకు ఓ సినిమా బాకీ ఉన్నారు వెంకటేష్. కథ కోసం వెతుకుతున్న తరుణంలో ప్రముఖ రచయిత భూపతిరాజా చెప్పిన స్టోరీ నచ్చేయడంతో దాన్నే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. కలిసుందాం రా హ్యాంగోవర్ తీవ్రంగా ఉండటంతో ఆ కాంబోనే మళ్ళీ రిపీట్ చేయాలని నిర్ణయించుకున్నారు.

Prematho Raa.. :ప్రేమ పండక హిట్లకు బ్రేక్ వేసిన రా

ఏదైనా బ్లాక్ బస్టర్ వస్తే అందులో ఉన్న సబ్జెక్టో లేదా టైటిలో ఒక ట్రెండ్ గా మారిపోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. అలా అని అన్ని ఒకే ఫలితాన్ని అందుకుంటాయని కాదు. తేడా కొట్టే సందర్భాలు కూడా ఎదురవుతాయి. అదెలాగో చూద్దాం. 1997లో ప్రేమించుకుందాం ‘రా’ సెన్సేషనల్ హిట్ అయ్యాక సినిమా పేరు చివరిలో రా పెట్టడం ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. దానికి తగ్గట్టే వెంకీ తర్వాత చేసిన ప్రేమంటే ఇదే’రా’ ఘనవిజయం అందుకోగా కలిసుందాం ‘రా’ ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. జయం మనదే’రా’ కూడా హిట్టే. దాని దర్శకుడు ఉదయ్ శంకర్ పేరు మారుమ్రోగిపోయింది. కాంబినేషన్ల క్రేజ్ ని వాడుకోవాలని ఏ నిర్మాతకైనా అనిపించడం సహజం.

ఆ టైంకి ప్రముఖ నిర్మాత టి త్రివిక్రమరావుకు ఓ సినిమా బాకీ ఉన్నారు వెంకటేష్. కథ కోసం వెతుకుతున్న తరుణంలో ప్రముఖ రచయిత భూపతిరాజా చెప్పిన స్టోరీ నచ్చేయడంతో దాన్నే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. కలిసుందాం రా హ్యాంగోవర్ తీవ్రంగా ఉండటంతో ఆ కాంబోనే మళ్ళీ రిపీట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయ్ శంకర్ ఓకే చెప్పగా హీరోయిన్ గా మళ్ళీ సిమ్రాన్ నే తీసుకున్నారు. ఇంకేముంది అనౌన్స్ మెంట్ స్టేజిలోనే ప్రేమతో ‘రా’కి క్రేజ్ వచ్చేసింది. రాజేంద్ర కుమార్ సంభాషణలు సమకూర్చగా మణిశర్మ కిక్కిచ్చే ఆల్బమ్ సిద్ధం చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్ గోపాల్ రెడ్డి కెమెరా బాధ్యతలు తీసుకున్నారు.

జులాయిగా అమ్మాయిలే ప్రపంచంగా తిరిగే ఓ యువకుడి వల్ల అతని అన్నయ్య పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. తన తప్పు తెలుసుకుని గతంలో ప్రేమించి వదిలేసి వచ్చిన అమ్మాయిని ఆరు నెలల్లో మళ్ళీ ఒప్పించే పనికి పూనుకుంటాడు. చివరికి అందరి మనసులు గెలుస్తాడు. ఫ్యామిలీ హీరోగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ ని ఇలాంటి పాత్రలో ప్రేక్షకులు అభిమానులు చూడలేకపోయారు. దానికి తోడు క్యారెక్టరైజేషన్ గోకులంలో సీతలో పవన్ కళ్యాణ్ పాత్రకు దగ్గరగా అనిపించడం మైనస్ అయ్యింది. 2001 మే 9న విడుదలైన ప్రేమతో రా వెంకటేష్ విజయ పరంపరకు బ్రేక్ వేసింది. పాటలు బాగుండటం ఒక్కటే రిలీఫ్

Also Read : Challenge : 5 సంవత్సరాలలో 50 లక్షల సంపాదన – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి