iDreamPost

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో మోడల్

మంచు వారబ్బాయి మంచు విష్ణు తన కలల ప్రాజెక్టు కన్నప్పను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ తారాగణం కూడా సెట్ అయ్యింది. అయితే ఈ చిత్రం నుండి హీరోయిన్ నుపూర్ సనన్ తప్పుకుంది..

మంచు వారబ్బాయి మంచు విష్ణు తన కలల ప్రాజెక్టు కన్నప్పను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ తారాగణం కూడా సెట్ అయ్యింది. అయితే ఈ చిత్రం నుండి హీరోయిన్ నుపూర్ సనన్ తప్పుకుంది..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో మోడల్

మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ భారీ అంచనాలను పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ న్యూజిలాండ్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ హీరోయిన్‌గా తొలుత బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపూర్ సనన్‌ను తీసుకున్నారు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో మెప్పించింది ఈ భామ. అయితే డేట్ సర్దుబాటు కాక ఈ మూవీ నుండి నుపూర్ సడెన్‌గా తప్పుకుంది. ఇప్పుడు ఆమె స్థానంలో మరో హీరోయిన్ వచ్చి చేరింది.

కన్నప్ప మూవీలో హీరోయిన్ కన్ఫమ్ అయ్యింది. ప్రీతి ముకుందన్‌ను తీసుకుంటున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఆమెకు స్వాగతం పలికింది చిత్ర యూనిట్. ప్రీతి ఓ మోడల్. ఆమెకిదే తొలి సినిమా. ‘కన్నప్పతో ప్రీతి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎంతో ప్రతిభ కలిగిన ఈ భరత నాట్య కళాకారిణి సినిమాకు మరింత ప్రత్యేకం కానుంది’ అని మూవీ యూనిట్ పేర్కొంది. కన్నప్పకు జోడీగా నటించేందుకు ఆడిషన్స్ నిర్వహించగా.. ఎన్నో రకాల ఆడిషన్స్ తర్వాత ఈ భామ సెలక్ట్ అయ్యింది. అలాగే ప్రీతికి ఇది తొలి సినిమా మాత్రమే కాదని, కళ, సినిమా రంగాల గురించి మరింత నేర్చుకునే అవకాశం ఈ చిత్రం ద్వారా లభిస్తుందని.. ఆమెతో కలిసి పనిచేసేందుకు టీం ఎదురుచూస్తున్నట్లు దర్శకుడు ముఖేష్ కుమార్ తెలిపారు.

Bhaktha Kannappa

ఇక ఈ సినిమా విజువల్ వండర్స్ క్రియేట్ చేయనుంది. కన్నప్పను మంచు మనోజ్ తన సొంత నిర్మాణంలో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో మోహన్ బాబు, ప్రభాస్, నయనతార, శివరాజ్ కుమార్, శరత్ బాబు, మోహన్ లాల్ వంటి దిగ్గజ నటులు యాక్ట్ చేస్తున్నారు. ప్రభాస్, నయన్ శివ పార్వతులుగా కనిపిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ మూవీకి మణి శర్మ,స్టీఫెన్ దేవసీలు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియలేదు. ఈ మూవీ ఎంత వసూలు చేయవచ్చునని భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి