iDreamPost

ప్రశాంత్ వర్మ ఇప్పుడు రవితేజ ఋణం తీర్చుకోబోతున్నాడా?

HANUMAN Movie Gratitude Meet: ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. ఈసారి చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ భారీ విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వర్షం కురిపిస్తుంది.

HANUMAN Movie Gratitude Meet: ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. ఈసారి చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ భారీ విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వర్షం కురిపిస్తుంది.

ప్రశాంత్ వర్మ ఇప్పుడు రవితేజ ఋణం తీర్చుకోబోతున్నాడా?

తెలుగు ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా స్టార్ హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరో సినిమా కూడా రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్ ‘సైంధవ’, నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ మూవీస్ తో పాటుగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ రిలీజ్ అయ్యింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక్కడే కాదు.. ఓవర్సీస్ లో కూడా ప్రభంజనం సృష్టించింది. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఆడియన్స్ ఆదరిస్తారని మరోసారి ‘హనుమాన్’ మూవీ రుజువు చేసింది. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మాస్ మహరాజ గురించి చెప్పిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సక్సెస్ సాధించినవారు చాలా తక్కువే ఉంటారు. అలాంటి వారిలో యువ దర్శకులు ప్రశాంత్ వర్మ ఒకరు. ఇండస్ట్రీలోకి ‘ఆ’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రానికి హీరో నాని నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో బోన్సాయి మొక్కకు ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉంది.. దీనికి మాస్ మహరాజ రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీలో కోతికి మరోసారి వాయిస్ ఓవర్ ఇచ్చారు రవితేజ. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న హనుమాన్ మూవీ ప్రస్తుతం రూ. 250 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వసూళ్లు చేసి ఇంకా ధియేటర్లో దుమ్మురేపుతూనే ఉంది. హనుమాన్ మూవీ విజయంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రశాంత్ వర్మ పదేళ్లకు సరిపడ లైనప్ సెట్ చేసి పెట్టుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ లైనప్ లో అధిరా, జై హనుమాన్, బాలకృష్ణతో ఓ సినిమాతో పాటు పలువురు స్టార్ హీరోలతో మూవీస్ ఉండబోతున్నాయని చెప్పారు. తాజాగా హనుమాన్ సక్సెస్ మీటోలో ప్రశాంత్ వర్మ.. రవితేజతో ఒక సినిమా ఉండబోతుందని తెలిపారు.

హనుమాన్ సెలబ్రెషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘హనుమాన్ మూవీ సక్సెస్ లో మాస్ మహరాజ రవితేజ పాత్ర కూడా ఎంతో ఉంది. ‘ఆ’ సినిమా సక్సెస్ నాకు ఎంతో బలం ఇచ్చింది.. అప్పటి నుంచి రవితేజ తో నాకు మంచి బంధం ఉంది. ఇండస్ట్రీలో రవితేజ కు ఎంతో గొప్ప పేరు ఉందో అందరికీ తెలిసిందే.. ఆయన కొత్తవారిని బాగా ఎంకరేజ్ చేస్తారు. సంక్రాంతికి ఆయన సినిమా రిలీజ్ ఉంది.. ఆ విషయం తెలిసి చాలా డౌట్ గా ఆయనకు ఫోన్ చేసి హనుమాన్ మూవీలో కోతికి వాయిస్ ఓవర్ ఇస్తారా? అని అడిగాను. వెంటనే వచ్చేయ్ చెప్పేద్దాం అని అన్నారు. నిజంగా ఇండస్ట్రీలో అలా సపోర్ట్ చేసేవాళ్లు చాలా తక్కువే ఉంటారు. అంత జెన్యూన్ పర్సన్ నాకు దొరకడం నా అదృష్టం. ఆయన హనుమాన్ మూవీ లో భాగమైనందుకు చాలా థ్యాంక్స్. ఆయన అంగీకరిస్తే ఆ కోటి క్యారెక్టర్ (కోతితో) ఒక సినిమా తీయాలనే ఆలోచన మా యూనివర్స్ లో అనుకుంటున్నాం’ అని అన్నారు. మొత్తానికి రవితేజ సహాయాన్ని గుర్తుంచుకొని ఆయన రుణం తీర్చుకునే పనిలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు అర్థమవుతుందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి