iDreamPost

Prashanth Varma: తెలుగు సినిమా వస్తుందంటే.. హాలీవుడ్ భయపడాలి: ప్రశాంత్ వర్మ

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మారు మోగుతోంది. బాక్సాఫీస్ వద్ద హనుమాన్ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తోంది.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మారు మోగుతోంది. బాక్సాఫీస్ వద్ద హనుమాన్ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తోంది.

Prashanth Varma: తెలుగు సినిమా వస్తుందంటే.. హాలీవుడ్ భయపడాలి: ప్రశాంత్ వర్మ

సూపర్ హీరోల కాన్సెప్ట్, సూపర్ హీరో యూనివర్స్ లకు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కాన్సెప్ట్ కు నెవర్ ఎండింగ్ ఫ్యాన్ సపోర్ట్ ఉంటుంది. అయితే ఇండియన్ సినిమాలో డైరెక్టర్లు ఈ కాన్సెప్ట్ కి చాలా దూరంగా ఉంటారు. పాన్ ఇండియా లెవల్లో ఎంతో గొప్ప సూపర్ హీరో ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా మన దగ్గర అలాంటి సినిమాలు తీయడం మాత్రం కష్టంగా మారిపోయింది. కానీ, ప్రశాంత్ వర్మ ఆ పరిస్థితిని మార్చేస్తాను అంటున్నాడు. ఇప్పటికే హనుమాన్ తో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్.. తెలుగు సినిమా వస్తోందంటే హాలీవుడ్ భయపడాలి అంటున్నాడు.

హనుమాన్ సినిమా రిలీజ్ కి ముందు ప్రశాంత్ వర్మ మాటలను చాలా మంది లైట్ తీసుకున్నారు. తన సినిమా విషయం అతను చూపిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ మంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. కానీ, సంక్రాంతి బరిలోకి దిగడం మాత్రమే కాకుండా టాలీవుడ్ లో హిట్టు కొట్టింది. అక్కడితో ఆగిపోకుండా.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొడుతోంది. కలెక్షన్స్ పరంగా అత్యధిక లాభాలు తెచ్చిపెట్టి నయా రికార్డులను క్రియేట్ చేస్తోంది. అయితే ప్రశాంత్ వర్మ విజన్ ఒక్క హనుమాన్ చిత్రంతో ఆగిపోయేది కాదు. అతను ప్రశాంత్ వర్మ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆ యూనివర్స్ లో మొత్తం 12 మంది సూపర్ హీరోలు ఉండబోతున్నారు.

ఇప్పటికే ప్రేక్షకులు హనుమంతుని చూసేశారు. అధీరా పేరుతో నెక్ట్స్ సూపర్ హీరోని పరిచయం చేసేందుకు ప్రశాంత్ వర్మ రెడీ అయిపోతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశాంత్ వర్మ తన గోల్ ని చెప్పుకొచ్చాడు. నిజానికి అది విన్న తర్వాత ప్రశాంత్ వర్మ విజన్ కి తెలుగు ప్రేక్షకులు మురిసిపోతున్నారు. అసలు ప్రశాంత్ వర్మ ఏం చెప్పాడంటే.. “మనం ఇక్కడ ఎలాగైతే సినిమా రిలీజ్ కి సంబంధించి డేట్స్ గురించి వేరే ప్రొడ్యూసర్స్ తో డిస్కషన్ చేస్తున్నామో.. అలాగే హాలీవుడ్ వాళ్లు ఇండియా నుంచి ఏ మూవీ వస్తోంది అంటూ డిస్కషన్ పెట్టే రేంజ్ కి మన సినిమాని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను” అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.

ఒక యంగ్ డైరెక్టర్ కి తన మీద తనకు ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రమే కాకుండా.. ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవల్ కి తీసుకెళ్లాలని అతను పడుతున్న తపనకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏదో ఒకరోజు ప్రశాంత్ వర్మ యూనివర్స్ మూవీస్ ఆ స్థాయికి చేరుకుంటాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అతని ఆత్మవిశ్వాసాన్ని కొనియాడుతున్నారు. ఇంక ప్రశాంత్ వర్మ టాలెంట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రూపంలో రిజల్ట్ ని రీసౌండింగ్ ఇస్తోంది. మరి.. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి