iDreamPost

జె.డి.యు నుండి ప్రశాంత్ కిషోర్ బహిష్కరణ.

జె.డి.యు నుండి ప్రశాంత్ కిషోర్ బహిష్కరణ.

ప్రశాంత్ కిషోర్, ఈ పేరు భారతదేశ రాజకీయ సర్కిల్స్ లో తెలియని వారు ఉండరు, తన వ్యూహ చతురతతో ప్రత్యర్ధి పార్టీలను మట్టి కరిపించగల జట్టి గా చూస్తారు,అనేక జయాలు, అతికొద్ది అపజయాలతో దూసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత తన రాజకీయ ప్రస్థానం జే.డి.యు పార్టీ నుండి ప్రారంభించారు. నితీష్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న ఆ పార్టీకి ఉపాధ్యక్షుడి హోదాలో సేవలు అందించారు. అయితే కొంత కాలంగా జే.డి.యు మిత్ర పక్షంగా ఉన్న బి.జే.పి పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేయడం సంచలంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా జే.డి.యి చీఫ్ బీహార్ సి.యం నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్ పై చేసిన వ్యాఖ్యలు ఆపై కిషోర్ ని పార్టీ నుండి బహిష్కరించటంతో రాజకీయ వేడి మరింత రాజుకుంది.

మిత్రపక్షంగా ఉన్న బి.జే.పి పై తన పార్టీలోనే ఉంటూ తీవ్ర విమర్శలు చేయడంతో ప్రశాంత్ కిషోర్ పై నితీష్ కుమార్ కొద్దికాలంగా తీవ్ర అసంతృప్తితో ఉనట్టు తెలుస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల దగ్గర మొదలైన పేచీ ప్రశాంత్ కిషోర్ సి.ఏ.ఏ. ఎన్.ఆర్.సి వంటి విషయాల్లో నేరుగా బి.జే.పి పై యుద్దానికే దిగారు. ఢిల్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పార్టీలో నంబర్ 2 గా ఉండి నేరుగా అమిత్షా పైనే విమర్శలు ఎక్కుపెట్టడంతో, ఇక ప్రశాంత్ కిషోర్ ని జే.డి.యులో ఉపేక్షించడం పార్టీకి అత్యంత ప్రమాదకరం అని భావించిన నితీష్ కుమార్ సాగనంపే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

‘నిన్నటి రోజున పార్టీ నాయకులు శాసన సభ్యులతో సమావేశం తరువాత నితీష్ కుమార్ మాట్లాడుతు ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉన్నా పరవాలేదు లేకున్నా పరవాలేదు ఎవరైనా ఇష్టం ఉన్నంతవరకు పార్టీలో ఉంటారు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు. అసలు ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఎలా చేరాడో తెలుసా. ప్రశాంత్ కిషోర్ ని పార్టీలో చేర్చుకోమని అమిత్ షానే నాకు చెప్పాడు అందుకే చేర్చుకున్నా అని వ్యాఖ్యానించి తీవ్ర దుమారమే లేపారు.దీనికి ప్రశాంత్ కిషోర్ ప్రతి స్పందిస్తూ నేను పార్టీలో ఎలా చేరానొ తెలిసి కూడా అబద్దం ఆడి ఎంత దిగజారావు నితీష్ అని ఘాటుగా స్పందించారు. దీంతో నేడు జే.డి.యు నుండి ప్రశాంత్ కిషోర్ ని అలాగే ఢిల్లీ ఎన్నికల్లో పొత్తును లేఖ ద్వారా బాహాటంగా విమర్శించిన జే.డియు నాయకుడు పవన్ వర్మను పార్టీలో నుండి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. నీతీష్ కూమార్ తీసుకున్న ఈ చర్యకు ప్రశాంత్ కిషోర్ స్పందిస్తు నితీష్ కి ధన్యవాదాలు తెలియజేస్తు మళ్ళీ మీరే బీహార్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించాలి అని కోరుకుంటున్నాను అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా వ్యూహకర్తగా అనేక విజయాలు సాధించిన ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ తొలి అడుగే ఇలా బహిష్కరణతో ముగియటం శోచనీయం . ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ ఎన్నికల్లో ఆం ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. బెంగాల్లో త్రుణమూల్ కాంగ్రెస్ కి కూడా వ్యహకర్తగా వ్యవహరించేందుకు ఇప్పటికే అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇకపై తన అడుగులు ప్రత్యక్ష రాజకీయాలవైపు ఉంటుందా లేక వ్యూహకర్తగానే ఉండిపోతారా అనేది వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి