iDreamPost

PrashantKishor కొత్త‌ పార్టీకాదు, 3వేల కిలోమీట‌ర్ల బీహార్ పాద‌యాత్ర‌, ప్ర‌శాంత్ కిషోర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

PrashantKishor కొత్త‌ పార్టీకాదు, 3వేల కిలోమీట‌ర్ల బీహార్ పాద‌యాత్ర‌,  ప్ర‌శాంత్ కిషోర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ పాద యాత్ర మొద‌లుపెట్ట‌నున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనుకున్న పీకే.. అందరికీ షాకిస్తూ, తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాన‌ని తేల్చేశారు. అలాగ‌ని ఇది కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న కాదు.

ఎలాంటి రాజకీయ పార్టీ, రాజకీయ వేదికను ప్రకటించలేదు. ‘జన్ సురాజ్’ కోసం రాబోయే 3, 4 నెలలో అందరినీ కలిసి మాట్లాడుతా. నా అభిప్రాయంతో కలిసి వచ్చే వారిని, నా ఉద్యమంలో చేర్చుకుంటాను. నేను రాజకీయ పార్టీ పెడితే, అది ప్రశాంత్ కిషోర్ పార్టీ కాదు, అందరి పార్టీ అని ప్ర‌క‌టించారు.

గాంధీ జయంతి నుంచి బిహార్‌లో పాదయాత్ర ప్రారంభించ‌నున్నారు పీకె. అ​క్టోబర్‌ నుంచి 3 వేల కిలోమీటర్లు వరకు పాదయాత్ర సాగుతుంది. వచ్చే 3, 4 నెలల్లో 17 వేల మందిని కలువ‌ల‌న్నాది ప్ర‌శాంత కిషోర్ టార్గెట్. బీహార్‌లో పాదయాత్ర చేసి, ప్రజల అభిప్రాయాలు తెలుకొన‌డానికి 4 నెలల పాటు ప్రజలతో మమేకం అవుతారు.

గురువారం ప్ర‌శాంత కిషోర్ మీడియాతో మాట్లాడారు ‘‘సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని బీహార్‌ కోసం ఉపయోగిస్తాను. లాలూ, నితీష్ పాలనలో బిహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. రాబోయే 10-15 ఏళ్లలో బిహార్ ప్రగతిశీల రాష్ట్రంగా ఎదగాలంటే, కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యం. ప్రజలంతా ఉమ్మ‌డిగా అడుగు వేస్తే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడతామ‌ని ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌క‌టించారు.

అందుకే కాంగ్రెస్ కు గుడ్ బై!

కాంగ్రెస్ లో ఎందుకు చేర‌లేదో కూడా ప్ర‌శాంత్ కిషోర్ వివ‌రించారు. యాక్ష‌న్ గ్రూప్ లో చేర‌మ‌ని కాంగ్రెస్ ఆహ్వానం ఇచ్చింది. నా ప్లాన్ ను అమ‌లు చేయ‌డానికికూడా సీరియ‌స్ గానే ఉంది. కాని పార్టీ రాజ్యాంగంలో ఎలాంటి హోదాలేని యాక్ష‌న్ గ్రూప్ (Empowered Action Group)లో చేర‌మ‌న్నారు. అందుకే ఒప్పుకోలేద‌ని ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి