iDreamPost

రవి తేజ మంచి వారు.. క్లాష్‌ ఉన్నా సాయం చేశారు: ప్రశాంత్‌ వర్మ!

హనుమాన్‌ సినిమా విడులపై గత కొద్ది రోజుల నుంచి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ప్రశాంత్‌ వర్మ స్పందిస్తూ ఓ క్లారిటీ ఇచ్చారు. కొంతమంది మూవీని ఆపాలని చూస్తున్నట్లు వెల్లడించారు.

హనుమాన్‌ సినిమా విడులపై గత కొద్ది రోజుల నుంచి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ప్రశాంత్‌ వర్మ స్పందిస్తూ ఓ క్లారిటీ ఇచ్చారు. కొంతమంది మూవీని ఆపాలని చూస్తున్నట్లు వెల్లడించారు.

రవి తేజ మంచి వారు.. క్లాష్‌ ఉన్నా సాయం చేశారు: ప్రశాంత్‌ వర్మ!

హనుమాన్‌ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మొన్న విడుదల అయిన ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ అవ్వనుంది. అయితే, గత కొంత కాలం నుంచి హనుమాన్‌ సినిమా విడుదలపై వివాదం నడుస్తోంది. హనుమాన్‌ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే, అదే సమయంలో ఓ రోజు అటు, ఇటు మరికొన్ని స్టార్‌ హీరోల సినిమాలు ఉన్నాయి.

దీంతో వివాదం మొదలైంది. హనుమాన్‌ కొంచెం వెనక్కు తగ్గాలని ఆ సినిమాలకు చెందిన నిర్మాతలు ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికి ప్రశాంత్‌ వర్మ వెనక్కు తగ్గలేదు. చెప్పిన డేటుకే వస్తానని తేల్చి చెప్పారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో వివాదం గురించి చెబుతూ.. ‘‘ వాళ్ల సినిమాకు పోటీగా వస్తున్నందుకు కొంతమందికి కోపంగా ఉందని అన్నారు. తాను దాన్ని ఫేస్‌ చేస్తున్నానని చెప్పారు. తాను చాలా ఫీల్‌ అయ్యానని, సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ తనను బూతులు తిడుతున్నారని కూడా చెప్పారు.

prasanth varma coments on industry

తనకు ఎవరితో వెళ్లి తిట్టించుకోవటం అలవాటు లేదని స్పష్టం చేశారు. తాను ఎవర్నీ ఇబ్బంది పెట్టనని, తన పని తాను చేసుకుంటూ ఉంటాని చెప్పారు. తాను వాళ్లను మార్చలేను కాబట్టి.. తను మెచ్యూర్‌ అయ్యానని అన్నారు. తాను దాన్ని పాజిటివ్‌ వేలో తీసుకుంటున్నానని చెప్పారు. సినిమాను నెగిటివ్‌ చేసే అవకాశం ఉందని, సెన్సార్‌ విషయంలో అడ్డంకులు వస్తే.. ఇన్‌ఫ్లుయెన్స్‌ ఉపయోగించి సాల్వ్‌ చేశానని చెప్పారు. ‘‘అది ఎవరు క్రియేట్‌ చేశారో తెలీదు.

ఎవరు ఆపాలని చూస్తున్నారో తెలీదు. కొంతమంది అడ్డంకులు కలిగిస్తున్నారు. నా దృష్టికి వచ్చింది. వెళ్లి గొడవ పెట్టుకోలేము కదా.. నాకున్న గుడ్‌విల్‌ను దీనికి వాడేస్తున్నాను’’ అని అన్నారు. మరో ఇంటర్వ్యూలో రవితేజ మంచి తనం గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ క్లాష్‌ లో వస్తున్నాం అంటే జనరల్లీ అందరూ తొక్కేద్దాం అని చూస్తారు. కానీ, రవితేజ గారు మా సినిమాలో ఒక క్యారెక్టర్‌కి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో మంచివాళ్లు కూడా ఉన్నారు’’ అని అన్నారు.

కాగా, జనవరి నెలలోనే రవితేజ సినిమా ‘ఈగల్‌’ కూడా వస్తోంది. జనవరి 14వ తేదీ విడుదల కానుంది. ఇక, హనుమాన్‌ సినిమాలో చిరంజీవి ఉన్నారన్న పుకార్లపై కూడా ప్రశాంత్‌ స్పందించారు. కొద్దిరోజుల క్రితం వచ్చిన ట్రైలర్‌ చివర్లో కనిపించే ఆంజనేయ స్వామి కళ్లు చిరంజీవివే కదా అన్న దానికి ‘‘ అవును!’’ అన్న సమాధానం ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. మరి, పోటీ ఉన్నా హనుమాన్‌ కోసం రవితేజ సాయం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి