iDreamPost

ట్రెండ్ సృష్టిస్తున్న డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ పిక్! నెట్టింట వైరల్!

  • Author ajaykrishna Published - 01:28 PM, Tue - 4 July 23
  • Author ajaykrishna Published - 01:28 PM, Tue - 4 July 23
ట్రెండ్ సృష్టిస్తున్న డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ పిక్! నెట్టింట వైరల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ రోజురోజుకి వరల్డ్ వైడ్ విస్తరిస్తూనే ఉంది. బాహుబలి సిరీస్ తో సూపర్ స్టార్డమ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. అదే క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ బిగ్ బడ్జెట్ మూవీస్ చేస్తున్నాడు. గతేడాది రాధేశ్యామ్ తో నిరాశపరిచిన డార్లింగ్.. ఇటీవల ఆదిపురుష్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. రామాయణం బేస్ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమా.. ముందు నుండి ట్రోల్స్ ఫేస్ చేస్తూ థియేటర్స్ కి వచ్చింది. రిలీజ్ ముందే భారీ హైప్ క్రియేట్ అయ్యేసరికి.. అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. సుమారు మూడు రోజుల్లోనే రూ. 340 కోట్లు కొల్లగొట్టిన ఆదిపురుష్.. ప్రభాస్ కెరీర్ లో మరో టాప్ ఓపెనింగ్స్ తెచ్చిన మూవీగా నిలిచింది.

ఇక ఆదిపురుష్ రిలీజ్ అయిపోయిన వెంటనే డార్లింగ్ ప్రభాస్.. తదుపరి సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలు క్రియేట్ చేసిన సలార్ నుండి జులై 6న టీజర్ రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉండగా.. డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించి ఓ వింటేజ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ అందరూ సలార్ టీజర్ కోసం చూస్తున్న టైమ్ లో.. ప్రభాస్ లవర్ బాయ్ లుక్ కనిపించేసరికి సర్ప్రైజ్ అవుతున్నారు. ఆ ఫోటోలో ప్రభాస్.. తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఉండటం మనం చూడవచ్చు. ఇక ప్రభాస్ లవర్ బాయ్ లుక్ చూస్తుంటే అప్పటికి ఇంకా సినిమాల్లోకి రాలేదని అనిపిస్తుంది. మరి నెట్టింట ట్రెండ్ అవుతున్న డార్లింగ్ వింటేజ్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Red FM Telugu (@redfmtelugu)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి