iDreamPost

Salaar: సలార్‌లో ప్రభాస్‌కు ఉన్నది 2 నిమిషాల డైలాగులే! అయినా.. ఊచకోత!

ప్రభాస్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సలార్‌ సినిమా డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కింది.

ప్రభాస్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సలార్‌ సినిమా డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కింది.

Salaar: సలార్‌లో ప్రభాస్‌కు ఉన్నది 2 నిమిషాల డైలాగులే! అయినా.. ఊచకోత!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- కేజీఎఫ్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో సలార్‌ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. విడుదలైన అన్ని భాషల్లో సలార్‌ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. మొదటి రోజు మూవీ ఏకంగా 178 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.

అయితే, సలార్‌లో ప్రభాస్‌ డైలాగులకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం.. సలార్‌ మొత్తం 2.30 గంటలకు పైగా నిడివి ఉన్న సినిమా కాగా.. అందులో ప్రభాస్‌ మాట్లాడింది కేవలం రెండు నిమిషాలు మాత్రమే. ఆయన మొత్తం డైలాగుల్ని ఓ చోట పేరిస్తే.. 2 నిమిషాల 33 సెకన్ల నిడివి వచ్చింది. ప్రస్తుతం ఈ డైలాగుల వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూస్తున్న జనం, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ప్రశాంత్‌ నీల్‌ను పొగడ్తలతో ముంచెత్తున్నారు. తక్కువ డైలాగులతో ఊచకోత కోయించాడని అంటున్నారు.

సలార్‌లో ప్రభాస్‌ డైలాగులు ( 1 నిమిషం)..

  • అమ్మాయిని వెతకటం కంటే ముందు.. ఇండియానుంచి బయటకు వెళ్లకుండా చూసుకుంటాను. ఓ నకిలీ కేసు పెట్టి.. పోలీస్‌ స్టేషన్‌కు ఎంబీసీకి పంపిస్తాను.
  • కోయి బాత్‌ నై చాచా.. మేబీ పీచే లేతా హూ…
  • బ్యాట్స్‌మ్యాన్‌కు బౌలింగ్‌ ఇచ్చినట్లు నాకు అన్నీ బిగించే పనులు ఇచ్చార్రా.. అదే ఇరగ్గొట్టే పని ఇస్తే.. ఒకటే దెబ్బ.
  • రేపటినుంచి రామాకు..
  • ఇంకొక రోజు..
  • రేయ్‌.. నేను లేకుండా క్రికేట్‌ ఆడుతున్నారా? రేపొస్తానులే..
  • ఆ అ‍మ్మాయిని వదిలేయండి..
  • సారీ పరి మర్చిపోయాను.. హ్యాపీ బర్త్‌డే..
  • నీ బర్త్‌డే నువ్వు కట్‌ చేయ్‌..
  • నువ్వు కట్‌ చేయ్‌ పరి..
  • ఆద్య నేను..
  • పగిలిందా..
  • బోర్డర్‌ దాటగానే..
  • గొంతు మారిండొచ్చు.. పిలుపు మారలేదు. అయినా ప్రపంచంలో మా అమ్మ తప్ప.. నన్ను దేవా అని పిలిచేది ఒక్కడే .. భరత రాజ మన్నార్‌.. అమ్మకు చెప్పి వస్తా.. వరదాకి..
  • పెద్ద పెద్ద గోడలు కట్టేది.. భయపడి.. బయటికి ఎవడు పోతాడో అని కాదు.. లోపలికి ఎవడు వస్తాడో అని..
  • అంతేగా..
  • ఇంకెన్ని సార్లు ఆపుతావు రా..
  • నన్ను వదిలేసేయ్‌.. ఈ రోజు మీ అందరూ ఎక్కడికి వెళ్లారు.
  • మీ పద్దతులే తప్పు..
  • కాటేరమ్మ పలకాలంటే.. పశువులు సంతకు పోవాలా? .. మందలో బాగా ఒళ్లు చేసి కొమ్ములు తిరిగిన పొట్టేలును పట్టాలా.. పట్టి ఊడ్చుకురావాలా.. మెడలో దండేసి.. ముఖానికి పసుపు కుంకుమ పూసి.. కత్తి రాయికి పెట్టి నూరాలా.. దాని ముఖాన నీళ్లు జల్లాల.. అది ఒళ్లు జలదరించిన వెంటనే.. సంతకుపోనా..

మరి, సలార్‌లో ప్రభాస్‌ కేవలం రెండు నిమిషాల్లో చెప్పిన ఈ డైలాగులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి