iDreamPost

Salaar: ఒక్క సెకనుకు రూ.80 లక్షలు పారితోషికం! ఇదీ ప్రభాస్ రేంజ్!

  • Published Jan 31, 2024 | 12:31 PMUpdated Jan 31, 2024 | 12:31 PM

ప్రభాస్ నటించిన "సలార్" గురించి నిన్న మొన్నటివరకు కూడా టాక్ నడుస్తూనే ఉంది. అయితే ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తర్వాత.. ఈ సినిమాలో కొన్ని కొత్త విషయాలను గమనిస్తున్నారు అభిమానులు. అవేంటో తెలుసుకుందాం.

ప్రభాస్ నటించిన "సలార్" గురించి నిన్న మొన్నటివరకు కూడా టాక్ నడుస్తూనే ఉంది. అయితే ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తర్వాత.. ఈ సినిమాలో కొన్ని కొత్త విషయాలను గమనిస్తున్నారు అభిమానులు. అవేంటో తెలుసుకుందాం.

  • Published Jan 31, 2024 | 12:31 PMUpdated Jan 31, 2024 | 12:31 PM
Salaar: ఒక్క సెకనుకు  రూ.80 లక్షలు పారితోషికం! ఇదీ ప్రభాస్ రేంజ్!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” సినిమా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అభిమానుల ఆరేళ్ళ ఆకలి తీర్చేసాడు ప్రభాస్. బాహుబలి రెండు భాగాల తర్వాత ప్రభాస్ ఖాతాలో పడిన బిగ్గెస్ట్ హిట్ “సలార్”. అభిమానులంతా ప్రభాస్ కట్ అవుట్ ను వెండి తెరపైన ఎలా చూడాలి అనుకుంటున్నారో.. సరిగ్గా అదే రేంజ్ లో చూపించాడు ప్రశాంత్ నీల్. ప్యాన్ ఇండియా చిత్రంగా విడుదలైన సలార్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. థియేటర్ స్క్రీన్ మీద డార్లింగ్ కనిపిస్తే చాలు అభిమానాలంతో పూనకాలతో ఊగిపోయేవారు. అంతా క్రేజ్ ను సంపాదించుకుంది “సలార్”. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లలో ఈ సినిమాను మిస్ అయినవారంతా ఓటీటీలో ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు.. కొన్ని కొత్త విషయాలను బయటకు తీస్తున్నారు. అది చూసిన మిగిలిన జనాలు అది కదా ప్రభాస్ రేంజ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.

2023 డిసెంబర్ 22న థియేటర్ లలో విడుదలైంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 700 కోట్ల కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లోను ఈ చిత్రం రచ్చ చేస్తోంది. అయితే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూసిన అభిమానులు. ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు. అదేంటంటే ప్రభాస్ సినిమా మొత్తం సినిమా మొత్తం మీద 2 నిమిషాల 35 సెకన్లు మాత్రమే డైలాగ్స్ చెప్పాడు. అయితే, ఈ చిత్రానికి డార్లింగ్ తీసుకున్న రెమ్యూనిరేషన్ అక్షరాలా రూ. 125 కోట్లు అనే టాక్ వినిపించింది. సలార్ లో ప్రభాస్ డైలాగులకు, ప్రభాస్ తీసుకున్న పారితోషకాన్ని బ్యాలన్స్ చేసి చూస్తే మాత్రం సెకనుకు రూ. 80,64,516 సంపాదించినట్లే. అంటే నిమిషానికి కొన్ని పదుల కోట్లు అందుకున్నాడు ప్రభాస్. సినీ ఇండస్ట్రీలో ఇలా కొన్ని నిమిషాలకు ఇన్ని వందల కోట్లు అందుకున్న రికార్డు ప్రభాస్ కే సొంతం. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఈ మాత్రం రేంజ్ ఉంటుందని మళ్ళీ నిరూపించాడు డార్లింగ్.

prabhas sallar remuneration

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో “సలార్” మంచి రెస్పాన్స్ తో కొనసాగుతోంది. “సలార్ పార్ట్ -1” చూసిన అభిమానులు నెక్స్ట్ పార్ట్ ఎపుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ పార్ట్-2 శౌర్యంగ పర్వం అని కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదల తర్వాత శౌర్యంగ పర్వం ఎటువంటి రికార్డులను బ్రేక్ చేస్తోందో వేచి చూడాలి. ప్రభాస్ కూడా కల్కి, రాజాసాబ్ ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ అభిమానులంతా డార్లింగ్ చిత్రాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి, సలార్ చిత్రంలో ప్రభాస్ డైలాగులు చెప్పిన సమయం గురించి.. నడుస్తున్న టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి