iDreamPost

Prabhas Unstoppable with NBK 2 ప్రభాస్ బాలయ్య షోలో హైలైట్స్ ఏంటంటే

Prabhas Unstoppable with NBK 2 ప్రభాస్ బాలయ్య షోలో హైలైట్స్ ఏంటంటే

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మరోసారి తెలిసి వచ్చింది. బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు అతిథిగా హాజరైన డార్లింగ్ అసలు స్ట్రీమింగ్ మొదలుకావడం ఆలస్యం ఆహా యాప్ ని క్రాష్ చేయించే రేంజ్ లో రచ్చ చేశాడు. కొద్ది గంటల పాటు సదరు టీమ్ కి ఏం జరుగుతోందో అర్థం చేసుకుని సాంకేతిక లోపాలను సరిచేయడానికి నాలుగు గంటలకు పైగానే పట్టిందంటే దెబ్బ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతగా ఉత్సుకత రేపిన ఈ బాహుబలి ఎపిసోడ్ తొలి భాగం నలభై అయిదు నిమిషాలది అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో ఇద్దరి మధ్య పలు ఆసక్తికరమైన సంగతులు సంఘటనలు చోటు చేసుకున్నాయి

అందులో మొదటిది ప్రభాస్ పెళ్లి. టైం వచ్చినప్పుడు చెబుతానన్న డార్లింగ్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు ఆ మేడం కృతి సనన్ కాదని క్లారిటీ ఇచ్చాడు. ఫోటో చూపించి అడిగితే అదంతా వట్టి ప్రచారమని ఆమె స్వయంగా చెప్పినా దీని గురించి డిస్కషన్ అవసరం లేదని కుండబద్దలు కొట్టాడు. అనుష్క పేరు నేరుగా చెప్పకపోయినా బాలయ్య అడిగిన ప్రశ్నకు లేదంటూ దాటవేసిన ప్రభాస్ తర్వాత ఫోన్ కాల్ ద్వారా రామ్ చరణ్ సహాయం తీసుకుందామనుకున్నా అది కూడా కామెడీగా రివర్స్ అయ్యింది. ముందు బాయ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని చెప్పిన చరణ్ త్వరలో డార్లింగ్ నోటి నుంచి గుడ్ న్యూస్ వింటారని చెప్పీ చెప్పక ఊరించి వదిలేశాడు

బాహుబలి టైంలో మిర్చి, రెబెల్ తాలూకు ముచ్చట్లు, మిస్టర్ పర్ఫెక్ట్ క్లైమాక్స్ నచ్చక దిల్ రాజు మూడు నెలలు వాయిదా వేసి రీ షూట్ చేయించడం, చిరంజీవి బాలకృష్ణ సినిమాల మధ్య వర్షంని రిలీజ్ చేసేందుకు ఎంఎస్ రాజు ధైర్యం చేయడం లాంటివి ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ఆతిధ్యానికి మారు పేరైన కృష్ణంరాజుగారి ఇంటికి వచ్చినప్పుడు శత్రువు అయినా సరే ఎలా గౌరవించాలో చెప్పిన తీరుని ఇద్దరూ పంచుకున్నారు. ఎక్కువగా ఎడిట్ చేయకుండా స్ట్రీమింగ్ చేయాలని ఆహా నిర్ణయించుకోవడంతో ఫస్ట్ పార్ట్ లో అధిక శాతం ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ టాపిక్ మీదే ఎక్కువ వెళ్లడం కొంత ల్యాగ్ అయ్యింది. గోపీచంద్ ఎంట్రీ, అతనితో సరదా కబుర్లు వచ్చే వారం 6న రిలీజ్ చేయబోతున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి