iDreamPost

ప్రభాస్-షారుక్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. ఆ విషయం కోసం తన్నుకోవడం ఏంట్రా బాబు!

  • Author singhj Published - 09:58 PM, Tue - 11 July 23
  • Author singhj Published - 09:58 PM, Tue - 11 July 23
ప్రభాస్-షారుక్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. ఆ విషయం కోసం తన్నుకోవడం ఏంట్రా బాబు!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ పాన్ ఇండియా రేంజ్​కు చేరుకున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ సిరీస్​తో పాటు ‘సాహో’, ‘ఆదిపురుష్’ లాంటి సినిమాలతో ఆయన పాపులారిటీ ఎంతగానో పెరిగిపోయింది. ఒకప్పుడు సౌత్ వరకు పరిమితమైన ప్రభాస్ క్రేజ్​ క్రమంగా బాలీవుడ్​ వరకు పాకింది. డార్లింగ్ చేసే మూవీస్​ కోసం సౌత్​తో పాటు నార్త్​ ఆడియెన్స్ కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదలై యూట్యూబ్​ను షేక్ చేసింది. టీజర్​లో ఉన్న డైలాగ్స్, ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ మూవీపై ఎక్స్​పెక్టేషన్స్​ను మరింతగా పెంచేసింది.

‘సలార్’ ట్రైలర్​తో మరింత రచ్చ చేసేందుకు మూవీ యూనిట్ రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ హవా మళ్లీ మొదలైనట్లే కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక డీలాపడ్డ షారుక్.. ‘పఠాన్’ బ్లాక్ బస్టర్ కావడంతో మళ్లీ రేసులోకి దూసుకొచ్చారు. ఇదే జోష్​లో ఆయన తర్వాతి మూవీని త్వరగా ఫినిష్ చేస్తున్నారు. షారుక్ నెక్స్ట్ మూవీకి సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘జవాన్’గా ఈ ఫిలిం టైటిల్​ను ఫిక్స్ చేశారు. నిన్న రిలీజైన ‘జవాన్’ ట్రైలర్​కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. ఈ ట్రైలర్​కు 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 112 మిలియన్ల వ్యూస్ వచ్చాయని మేకర్స్ ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడో గొడవకు కారణమైంది.

సోషల్ మీడియాలో ప్రభాస్, షారుక్ ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు. ‘సలార్’ టీజర్ 24 గంటల్లో 83 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. యూట్యూబ్​లో ఆ నంబర్స్ కనిపించాయి. కానీ 112 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటున్న ‘జవాన్’ ట్రైలర్​కు మాత్రం యూట్యూబ్​లో ఆ నంబర్ కనిపించలేదు. హిందీ, తమిళం, తెలుగు కలిపి ‘జవాన్’ ట్రైలర్​కు 55 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్, కింగ్ ఖాన్ ఫ్యాన్స్.. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ ట్విట్టర్​లో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ వ్యూస్ గోలేంటి? ఈ కారణానికి తన్నుకోవడం ఏంట్రా బాబు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి.. ‘జవాన్’ ట్రైలర్ మీరు చూశారా? ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి