iDreamPost

ఏపీలో రాజకీయ నాయకుల పిడకల వేట..!

ఏపీలో రాజకీయ నాయకుల పిడకల వేట..!

 కిట్టయ్య బావా.. నాకో డౌటు.. అడగమంటావా? కోప్పడ కూడదు మరి? అంటూ వచ్చీ రావడంతోనే కిట్టయ్య తింటున్న ప్లేట్‌లో ఉన్న సల్లబజ్జీలు రెండు తీసుకుని నోట్లో వేసుకుంటూ.. అడిగాడు మణి.

ఏంట్రోయ్‌ నాకు కోపమొచ్చేంత, నీ డౌటు అంటూ.. మణి వైపుతిరిగాడు కిట్టయ్య.

ఏం లేదు బావా.. ఈ మధ్యన నీకు అసహనం ఎక్కువైపోతోంది. మొన్నటికి మొన్న నేనేదో అందామని ప్రారంభించేలోపే తెగ తిట్టేసావు. అందుకే ఎందుకైనా మంచిదని ముందే నీ దగ్గర్నుంచి హామీ తీసుకుంటున్నాను అంటూ ఇంకో రెండు బజ్జీల కోసం చేయి చాపుతూ అన్నాడు మణి.

సర్లేరా బాబూ.. నువ్వు తలా తోకా లేకుండా బుర్ర తింటే మరి మండదా.. అందుకే తిట్టుంటాను. దాని గొడవ పక్కన పెట్టి.. ఏంటో అడుగు అన్నాడు కిట్టయ్య.. మణి చేతిలో రెండు సల్ల బజ్జీలు పెడుతూ..

ఏం లేదు బావా.. అప్పుడెప్పుట్నుంచో వింటుంటాను.. రామాయణంలో పిడకల వేట.. అంటారే.. అంటే ఏంటి బా.. సెప్పు అన్నాడు మణి.

ఒరేయ్‌ మణీ.. నా మట్టుకు నేను బ్రహ్మాజీ బండి దగ్గర్నుంచి సల్ల పుణుగులు తెచ్చుకుని తెల్ల చట్నీలో ముంజుకు తింటుంటే.. నా బజ్జీల్లో వాటాకొచ్చిందే కాక.. తిక్కతిక్క ప్రశ్నలేస్తావా.. అంటూ కయ్యిమని అరిచాడు కిట్టయ్య.

బావా.. బావా.. కొంచెం ఆగు.. అందుకే ముందు నీ దగ్గర హామీ తీసుకున్నాను.. నువ్వు నన్ను తిట్టావంటే మా అక్కమీద ఒట్టు అంతే.. అంటూ అనేసి కిట్టయ్యకు కొంచెం దూరంగా వెళ్ళి నిలబడ్డాడు మణి.

మణిగాడడిగిన క్వశ్చిన్‌కు కాస్తంత కన్ఫ్యూజ్‌ అయ్యి.. సల్లబజ్జీలు తినడానికి బ్రేక్‌ ఇచ్చాడు కిట్టయ్య. వాటిని పక్కన పెట్టేసి గ్లాసులో మంచినీళ్ళు తాగుతూ మణిగాడి దగ్గరకొచ్చి జబ్బమీద చెయ్యేసాడు.

కిట్టయ్య మూడ్‌ మారిందని గమనించి మణి.. బావా.. నేనడిగింది అంటూ.. నసిగాడు.

దీంతో వీడు వదిలేలా లేడని మనసుల్లోని అనుకుంటూ.. గ్లాసులో నీళ్లు మొత్తం తాగేసి పక్కన పెట్టి చెప్పడం మొదలెట్టాడు కిట్టయ్య.

ఏం లేదురా.. రామాయణంలో పిడకల వేట.. అంటే అర్ధం తెలీదు గానీ సరిగ్గా దీనికి లాంటిదే ఇంకో విషయం చెబుతాను.. దాన్ని బట్టి నువ్వే అర్ధం చేసేసుకోవచ్చు అన్నాడు కిట్టయ్య.

అయితే చెప్పు బావా.. అంటూ చెవులు రిక్కించాడు మణి.

ఏం లేదురు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తరువాత ఏపీలో ఉన్న పేదలకు ఇళ్ళస్థలం ఇచ్చిన సీఎమ్మే లేడు. ఒక వేళ ఇచ్చినా ఒకటి అరా తప్పితే.. అర్హతను గుర్తించి స్థలం మాత్రం ఇవ్వలేదురా. ఇప్పుడు జగన్‌ ఒకే సారి 30 లక్షల మందికిపైగా పేదలకు ఇంటి స్థలాన్ని కేటాయించాడు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జగన్‌ను అభినందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.. నువ్వు గమనించావా అంటూ ఎదురు ప్రశ్న వేసాడు కిట్టయ్య.

విమర్శలు చేస్తున్నారు.. అదేగా బావా అన్నాడు మణి.

అదే కాదురోయ్‌.. ట్విట్టర్‌లో మాత్రమే ఉండే లోకేష్‌బాబు ఇప్పుడే రైతుల పొలాల్లోకి వస్తున్నాడు.. ఎప్పుడు ప్రశ్నిస్తాడో తెలియని పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడే వెంటవెంటనే ప్రశ్నలేసేస్తున్నాడు.. చూళ్ళేదేంట్రా అన్నాడు కిట్టయ్య.

నువ్వు చెబుతుంటే గుర్తొస్తోంది బావా.. ఈ మధ్యన ఏ ఎలక్షన్లు లేవు. వీళ్ళందరికీ ప్రజల మీద ఇంత బాధ్యత ఎలా వచ్చేసిందా అన్న అనుమానం వచ్చింది బావోయ్‌.. నాకూనూ అన్నాడు మణి.

ఇలా వీళ్ళకు ఇప్పుడు వచ్చిన బాధ్యతనేరా రామాయణంలో పిడకల వేట అంటారు అన్నాడు కిట్టయ్య.

బావా కొంత అర్ధమైనట్టుగానే ఉంది గానీ.. ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు బావా.. అన్నాడు మణి.

దీంతో వీడికి పూర్తిగా చెబితేనే గానీ తలకెక్కదని ఫిక్సయిపోయిన కిట్టయ్య.. మళ్ళీ మొదలెట్టాడు.

ఇళ్ళ స్థలాలు పొందిన పేదోళ్ళంతా జగన్‌ను మెచ్చుకుంటున్నారు కదరా. దీంతో వాళ్ళంతా జగన్‌కే ఫిక్సయిపోతారని వీళ్ళకు కంగారట్టుకుంది. దీంతో ఎంతో కొంత ప్రజలను ఈ ఇళ్ళ పండుగ నుంచి డైవర్ట్‌ చెయ్యాలన్నదే వీళ్ళ టార్గెట్‌ అన్నమాట. పొగడాల్సిన పనికి పొగడకపోగా లేనిపోని అభాండాలు వేయడానికే సిద్ధపడుతున్నారన్న మాట. దీన్నే పిడకల వేట అంటారన్న మాట అంటూ తేల్చాడు కిట్టయ్య..

అవును బావోయ్‌.. నువ్వు చెప్పిందీ కరెక్టే.. అంటూ సల్లబజ్జీ రుచి గుర్తొచ్చిన మణి.. బ్రహ్మాజీ బజ్జీబండి దగ్గరకు బయలేదురాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి