iDreamPost

లోకేశ్ కన్నీళ్లు.. నాడు వైఎస్ కుటుంబ వేదన మాటేంటి!

నారా చంద్రబాబును బయటకు తీసుకొచ్చేందుకు ఆయన కొడుకు నారా లోకేశ్ చేయని ప్రయత్నం లేదు. శనివారం రోజు అయితే ఏకంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే లోకేశ్ కన్నీరు పెట్టుకోవడంపై సింపతీ కంటే.. వ్యతిరేకత ఎక్కువగా వ్యక్తమైందిని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది

నారా చంద్రబాబును బయటకు తీసుకొచ్చేందుకు ఆయన కొడుకు నారా లోకేశ్ చేయని ప్రయత్నం లేదు. శనివారం రోజు అయితే ఏకంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే లోకేశ్ కన్నీరు పెట్టుకోవడంపై సింపతీ కంటే.. వ్యతిరేకత ఎక్కువగా వ్యక్తమైందిని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది

లోకేశ్ కన్నీళ్లు.. నాడు వైఎస్ కుటుంబ వేదన మాటేంటి!

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 8న అరెస్టుగా..40 రోజులకు పైనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక చంద్రబాబును బయటకు తీసుకొచ్చేందుకు ఆయన కొడుకు నారా లోకేశ్ చేయని ప్రయత్నం లేదు. శనివారం రోజు అయితే ఏకంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే లోకేశ్ కన్నీరు పెట్టుకోవడంపై సింపతీ కంటే.. వ్యతిరేకత ఎక్కువగా వ్యక్తమైందని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అన్యాయం అరెస్టు చేసినప్పుడు ఆ కుటుంబ వేదన గుర్తులేదా అంటూ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

శనివారం టీడీపీ విస్తృత స్తాయి సమావేశంలో నారా లోకేష్ తన కుటుంబం, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి జరుగుతున్న పరాభవంపై బాధను వెలిబుచ్చారు. చంద్రబాబు విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై నారా లోకేశ్  మండిపడ్డారు. ఏపీ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి జైల్లో బెట్టారని కన్నీరు పెట్టుకున్నారు లోకేష్. అంతే కాదు ఎప్పుడూ బయటకురాని తన తల్లి భువనేశ్వరిని మానసికక్షోభకు గురిచేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తండ్రి జైలుకు వెళ్లడంపై నారా లోకేశ్ కన్నీరు పెట్టుకోవడం ఆయనకు నెగిటివీటిని పెంచిందనే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. నాయకుండే కష్టకాలంలో ధైర్యంగా నిలబడి, శ్రేణులకు భరోసా కల్పించాలని కోరుకుంటారు. కానీ లోకేశ్ మాత్రం ఒక్కసారిగా  బోరునమనడంతో జనంతో పాటు టీడీపీ నేతలు షాక్ గురయ్యారు. లోకేశ్  భావోద్వేగంపై టీడీపీకి చెందిన కొంతమంది  ఆవేదన చెందడం తప్ప, మెజార్టీ ప్రజలు తప్పు పడుతోందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. 40 రోజులకే చంద్రాబబు కుటుంబం అంతగా తల్లడిల్లితే.. ఆనాడు వైఎస్ కుటుంబం ఎంత వేదన చెంది ఉంటుందో తెలియదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

కుటుంబ పెద్ద మరణిస్తే.. చిన్న వయస్సులోనే రాజకీయం, ఫ్యామిలీ బాధ్యతల్ని చేపట్టాల్సిన జగన్ ను అక్రమంగా 16 నెలలు జైల్లో వేసినప్పుడు, వైఎస్ కుటుంబ సభ్యుల ఆవేదన మాటేంటనే ప్రశ్నలు వినిపిస్తోన్నాయి. అంతేకాక చంద్రాబాబు జైల్లో ఉన్నప్పటికి బలమైన  పార్టీ అండగా ఉందని, కానీ ఆనాడు జగన్ పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్దమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయంగా ఏకాకైన వైఎస్ జగన్ కుటుంబం నాడు ఎంతటి దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని, కానీ వాళ్లేప్పుడూ లోకేశ్ మాదిరి భోరన విలపించలేదని కొందరు అభిప్రాయా పడుతున్నారు.

చంద్రబాబు జీవిత, రాజకీయ చివరి దశలో జైలు పాలయ్యారని, జగన్ విషయానికి వస్తే అందుకు పూర్తిగా సరిగ్గా మొదలయ్యే దశలోనే జైల్లో పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాలం ప్రతి ఒక్కరి కర్మను అనుభవించేలా చేస్తుందని,నేరం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అంటూ పొలిటికల్ సర్కిల్ లో కామెంట్స్ వినిపిస్తోన్నాయి. మరి.. చంద్రబాబు అరెస్టు విషయంలో లోకేశ్ ఏడవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి