iDreamPost

దిశా యాప్ ద్వారా 5 నిమిషాల్లో మహిళను రక్షించిన పోలీసులు

దిశా యాప్ ద్వారా 5 నిమిషాల్లో మహిళను రక్షించిన పోలీసులు

మహిళల రక్షణ కోసం దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన “దిశా” యాప్ ద్వారా తోలి కేసు నమోదయ్యింది. ఈరోజు వేకువజామయున విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళా అధికారి పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెని వేధింపులకు గురిచేశాడు. దింతో తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో భాదిత మహిళ దిశా యాప్ లో మెస్సేజ్ చెయ్యడంతో వెంటనే దిశా యాప్ ద్వారా కాల్ సెంటర్ కి SOS కాల్ వెళ్లడంతో, జిపిఎస్ ద్వారా మహిళ ప్రయాణిస్తున్న బస్సు లొకేషన్ ని గుర్తించిన కాల్ సెంటర్ వెంటనే ఆ సమీపంలోని ఎమర్జెన్సీ టీం కు సమాచారం పంపింది.

కాల్ సెంటర్ నుండి సమాచారం అందుకున్న దిశా ప్రత్యేక టీం ఐదు నిమిషాల్లో ఏలూరు సమీపంలోని భాదిత మహిళా ప్రయాణిస్తున్న బస్సు వద్దకు చేరుకున్నారు. వెంటనే మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఏలూరు లోని 3 వ పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిందితుడిపై జీరో FIR నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో భాదిత మహిళ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన దిశా ప్రత్యేక టీం పట్ల మహిళలతో పాటు మహిళ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో దిశా టీం సభ్యులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

లైంగిక దాడులకు, అకృత్యాలకు గురైన మహిళలకు సత్వరం న్యాయం చెయ్యడానికి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి ప్రత్యేకంగా ‘దిశా’ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు సంబంధించిన ఏ నేరాన్నైనా దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయోచ్చు. ఈ ప్రత్యేక దిశా స్టేషన్లో రోజు మొత్తం 24 గంటలు పాటు కంట్రోల్ రూము ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

అంతేకాకూండా ప్రభుత్వం మహిళలకోసం “దిశా ప్రత్యేక యాప్” ని కూడా రూపొందించారు. ఈ యాప్ ద్వారా కూడా మహిళలు అందుబాటులో ఉన్న అన్నిసేవలు వినియోగించుకోవచ్చు. ఈ దిశా యాప్ పై త్వరలోనే కాలేజీ మహిళా ఉద్యోగులు, విద్యార్దునలుతో పాటు మహిళలందరికీ అవగాహన కల్పిస్తామని, ఈ దిశా యాప్ ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని డిజిపి గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు 5 వేల మందికి పైగా ఈ దిశా యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి