iDreamPost

రైతులకు అలర్ట్.. హైదరాబాద్ శివార్లలో కొత్త తరహా చోరీలు!

ఈజీ మనీకి అలవాటు పడినవారు కొత్త రకం మోసాలకు తెరలేపుతున్నారు. కొందరు ఫేక్ మెసేజ్ లు, ఫేక్ లింక్స్ పంపి ఖాతాలు లూటీ చేస్తున్నారు. కానీ ఈ దొంగలు మాత్రం వీటికి భిన్నంగా ఆలోచించి సరికొత్త మోసానికి తెరలేపారు

ఈజీ మనీకి అలవాటు పడినవారు కొత్త రకం మోసాలకు తెరలేపుతున్నారు. కొందరు ఫేక్ మెసేజ్ లు, ఫేక్ లింక్స్ పంపి ఖాతాలు లూటీ చేస్తున్నారు. కానీ ఈ దొంగలు మాత్రం వీటికి భిన్నంగా ఆలోచించి సరికొత్త మోసానికి తెరలేపారు

రైతులకు అలర్ట్.. హైదరాబాద్ శివార్లలో కొత్త తరహా చోరీలు!

రోజుకో రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడినవారు కొత్త రకం మోసాలకు తెరలేపుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు దొంగతనాలకు పాల్పడుతుంటే.. మరికొందరు జల్సాలకు అలవాటు పడి ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు ఫేక్ మెసేజ్ లు, ఫేక్ లింక్స్ పంపి ఖాతాలు లూటీ చేస్తున్నారు. కానీ ఈ దొంగలు మాత్రం వీటికి భిన్నంగా ఆలోచించారు. ఏకంగా రైతులకే కన్నం వేసేందుకు ప్లాన్ చేశారు. పంట పొలాల వద్ద, వ్యవసాయ బావుల వద్ద పార్క్ చేసిన ట్రాక్టర్లను, ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివార్లలో ఈ సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది.

రైతన్నలకు బిగ్ అలర్ట్. మీరు మీ వ్యవసాయ బావుల వద్ద ట్రాక్టర్లను పార్క్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. రాత్రికి రాత్రే చోరీ చేసి రాష్ట్రం దాటించేస్తున్నారు ఇద్దరు అంతర్‌ జిల్లా దొంగలు. ఆ తర్వాత కొట్టేసిన వాటిని పలు ఆన్ లైన్ వేదికల ద్వారా అమ్మేసి సొమ్ము పోగేసుకుంటున్నారు. ఇటీవల ఓ ట్రాక్టర్ చోరీకాగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఆ దొంగల ముఠా బండారం బయటపడింది. ఇప్పటి వరకు చోరీ చేసిన ట్రాక్రర్లను, ట్రాక్టర్ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. కాగా వ్యవసాయ కూలీలుగా పనిచేసే సంపంగి మహేష్, ఉర్స్ వెంకన్న అనే ఇద్దరు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఏం చేయాలో తోచక ఈ దొంగతనాలకు తెరలేపారు. రాత్రి వేళ వ్యవసాయ బావుల వద్ద ఉంచిన ట్రాక్టర్లను ఎత్తుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రం దాటిస్తున్నారు.

ఆ తర్వాత పక్కా ప్లాన్ తో ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు. ఓఎల్ఎక్స్ లో అమ్ముకుని వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. ఇటీవల మాడ్గుల్ మండలం(రంగారెడ్డి జిల్లా) పరిధిలో డిసెంబర్‌ 31న ఈ ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు ట్రాక్టర్‌ దొంగతనం చేశారు. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎట్టకేలకు దొంగలు దొరికిపోయారు. దొంగల నుంచి సుమారు 20 లక్షలు విలువ చేసే 13 ట్రాక్టర్‌ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ లో 10 దొంగతనాలు జరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా నల్గొండలో ఒకటి, నాగర్ కర్నూల్లో ఒక కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్న ఇద్దరు అంతర్‌ జిల్లా దొంగలను అరెస్ట్‌ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు వెల్లడించారు. మరి ట్రాక్టర్ల చోరీలకు పాల్పడుతున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి