iDreamPost

ప్రజ్ఞానందపై ప్రధాని మోడీ ప్రశంసలు.. నిన్ను చూసి గర్విస్తున్నానంటూ..!

  • Author singhj Updated - 03:55 PM, Thu - 7 December 23

ఇది క్రీడా రంగానికీ వర్తిస్తుంది. టాలెంట్ కలిగిన క్రీడాకారులు, మట్టిలో మాణిక్యాలు అనేవాళ్లు చాలానే ఉన్నారు.

ఇది క్రీడా రంగానికీ వర్తిస్తుంది. టాలెంట్ కలిగిన క్రీడాకారులు, మట్టిలో మాణిక్యాలు అనేవాళ్లు చాలానే ఉన్నారు.

  • Author singhj Updated - 03:55 PM, Thu - 7 December 23
ప్రజ్ఞానందపై ప్రధాని మోడీ ప్రశంసలు.. నిన్ను చూసి గర్విస్తున్నానంటూ..!

భారత్​లో ప్రతిభకు కొదవ లేదు. టాలెంట్ కలిగిన ఎంతో మంది యువకులు ఇక్కడ ఉన్నారు. అయితే వారిని గుర్తించి, సానబెట్టేవారే కరువయ్యారు. ప్రతిభ కలిగిన వారిని గుర్తించి, వారిని తీర్చిదిద్దితే ఎన్నో రంగాల్లో భారత్ అద్భుతాలు చేయగలదు. ఇది క్రీడా రంగానికీ వర్తిస్తుంది. టాలెంట్ కలిగిన క్రీడాకారులు, మట్టిలో మాణిక్యాలు అనేవాళ్లు చాలానే ఉన్నారు. తమ అపూర్వ ప్రతిభతో దేశానికి కీర్తి, ప్రతిష్టలు సంపాదించగల సామర్థ్యం వారి సొంతం. అలాంటి ఓ ఆణిముత్యమే భారత యంగ్ గ్రాండ్ మాస్టర్ రమేశ్​బాబు ప్రజ్ఞానంద. ఇటీవల జరిగిన చెస్ వరల్డ్ కప్​లో ఈ 18 ఏళ్ల కుర్రాడు అద్భుతంగా రాణించాడు.

ఎవరూ ఊహించని విధంగా చెస్ వరల్డ్ కప్​లో ఫైనల్స్​కు చేరుకున్నాడు ప్రజ్ఞానంద. అయితే తుది సమరంలో అనుభవజ్ఞుడు, నార్వే నంబర్ వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్​సన్​ చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ టోర్నీలో 36 ఏళ్ల కార్ల్​సన్​ విజేతగా నిలిచినా.. ప్రజ్ఞానంద మాత్రం అంత సులువుగా లొంగిపోలేదు. వరుసగా రెండు గేమ్​లను డ్రా చేసుకొని, టై బ్రేక్ వరకు తీసుకెళ్లాడు. అయితే టై బ్రేక్​లో తడబడిన ప్రజ్ఞానంద.. ఒత్తిడికి లోనవ్వడంతో ఓటమిపాలై రన్నరప్​తో సరిపెట్టుకున్నాడు. అయినా ఈ యంగ్ ప్లేయర్​పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశాడు. తన ఫ్యామిలీతో కలసి ఢిల్లీకి వెళ్లిన ప్రజ్ఞానంద.. మోడీతో కాసేపు ముచ్చటించాడు. అనంతరం తాను గెలిచిన సిల్వర్​ మెడల్​ను మోడీకి చూపించాడు. ఆ తర్వాత మోడీ.. ప్రజ్ఞానంద ఫ్యామిలీతో సరదాగా గడిపారు. ప్రధాని మోడీని కలవడం సంతోషంగా ఉందని.. తనతో పాటు తన పేరెంట్స్​ను ప్రోత్సహించినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు ప్రజ్ఞానంద. ఈ ట్వీట్​ను మోడీ రీట్వీట్ చేశారు. ప్రజ్ఞానందను, అతడి తల్లిదండ్రుల్ని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు మోడీ. అతడ్ని చూసి గర్విస్తున్నానని తన ట్వీట్​లో రాసుకొచ్చారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని దేశ యువతకు ప్రజ్ఞానంద ఉదాహరణగా నిలిచాడని మోడీ మెచ్చుకున్నారు.

ఇది కూడా చదవండి:
టీచర్ల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ట్రాన్స్​ఫర్స్ ఎప్పటి నుంచంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి