iDreamPost

రైతులకు వరం ఈ పథకం.. 10 శాతం డబ్బులు చెల్లిస్తే చాలు! దరఖాస్తు చేసుకోండిలా..

  • Published Feb 06, 2024 | 8:51 PMUpdated Feb 06, 2024 | 8:51 PM

అన్నదాతల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు తీసుకొస్తుంటాయి. అలాంటి ఓ పథకమే ఇది. ఈ స్కీమ్ రైతన్నలకు వరం లాంటిది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అన్నదాతల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు తీసుకొస్తుంటాయి. అలాంటి ఓ పథకమే ఇది. ఈ స్కీమ్ రైతన్నలకు వరం లాంటిది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 06, 2024 | 8:51 PMUpdated Feb 06, 2024 | 8:51 PM
రైతులకు వరం ఈ పథకం.. 10 శాతం డబ్బులు చెల్లిస్తే చాలు! దరఖాస్తు చేసుకోండిలా..

దేశానికి అన్నం పెట్టే రైతన్నల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త పథకాలు తీసుకొస్తుంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే స్కీమ్స్ గురించి ప్రజలకు తెలుస్తుంది. సర్కారు చేసే ప్రచారం వల్ల ఇవి జనాల్లోకి సులువుగా చొచ్చుకొని పోతాయి. అందుకే వీటికి అన్నదాతలు దరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందుతారు. అయితే కేంద్ర ప్రభుత్వాలు రైతుల కోసం తీసుకొచ్చే పథకాల గురించి మాత్రం చాలా మందికి అవగాహన ఉండదు. వీటి గురించి అంతగా ప్రచారం చేయకపోవడం, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సరిపోకపోవడం వల్లే చాలా స్కీమ్స్ ప్రయోజనం లేకుండా పోతున్నాయి. అయితే అన్నదాతలకు మేలు చేసే ఓ పథకం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది వారికి ఓ వరం లాంటిది.

పీఎం కుసుమ్ యోజన.. ఇది రైతులకు ఓ వరం లాంటిది. దీని పూర్తి పేరు ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాఅభియాన్. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ఇప్పుడు అమల్లోనే ఉంది. అన్నదాతలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ స్కీమ్​ను కొన్ని దశాబ్దాల పాటు కొనసాగించాలని మోడీ సర్కారు అనుకుంటోంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కేంద్రం సోలార్ పంపులను ఏర్పాటు చేస్తోంది. అలాగే కొత్త సోలార్ పవర్ ప్లాంట్​లనూ ఏర్పాట్లు చేస్తోంది. అన్నదాతలు తమ పొలాల్లోని పంపు సెట్లకు విద్యుత్తును సోలార్ ప్యానెల్స్ ద్వారా రప్పించుకోవచ్చు. అందుకు కావాల్సిన ఏర్పాట్లను ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

Farmers scheme modi

పీఎం కుసుమ్ యోజన పథకానికి రైతన్నలు ఒక్కొక్కరు విడిగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. కొంతమంది అన్నదాతలు ఒక బృందంగా ఏర్పడి దీనికి అప్లయ్ చేసుకోవచ్చు. అలాగే పంచాయతీలు, సహకార సంఘాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు కేంద్ర సర్కారు సోలారు పంపులను ఏర్పాటు చేస్తుంది. ఈ స్కీమ్ కింద ఇచ్చే ఒక్కో సోలార్ పంపు 7.5 హెచ్​పీ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ స్కీమ్ కింద 60 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తోంది. సబ్సిడీ పోనూ మిగతా 40 శాతంలో 30 శాతానికి కేంద్రమే లోన్ ఇస్తుంది. సో, 10 శాతం మాత్రమే అన్నదాతలు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 30 శాతాన్ని రుణ చెల్లింపుగా పెట్టుకోవాలి. ఈ స్కీమ్ కింద వచ్చే పంపు సెట్లు 60 శాతం ఉచితంగా దక్కినట్లు అవుతుంది. మరి.. పీఎం కుసుమ్ యోజన స్కీమ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి