iDreamPost

వీడియో: విమానం ల్యాండ్ అవుతుండగా మంటలు!

తరచూ ఏదో ఒక్క ప్రాంతంలో విమానాలు, హెలికాఫ్టర్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు కాలి బూడిదై పోతున్నారు. తాజాగా రన్ వేపై దిగుతున్న ఓ విమానం అగ్నిప్రమాదానికి గురైంది. అందులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు.

తరచూ ఏదో ఒక్క ప్రాంతంలో విమానాలు, హెలికాఫ్టర్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు కాలి బూడిదై పోతున్నారు. తాజాగా రన్ వేపై దిగుతున్న ఓ విమానం అగ్నిప్రమాదానికి గురైంది. అందులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు.

వీడియో: విమానం ల్యాండ్ అవుతుండగా మంటలు!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా  రసాయనాల పేలుడు, వాహనాలు ఢీకొనడం, షార్ట్ సర్కూట్ వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో మంది సజీవ దహనం అవుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే.. సాంకేతి లోపం కారణంగా విమానాలు, హెలికాప్టర్ల వంటి వాటిలో కూడా అగ్నిప్రమాదాలకు జరుగుతుంటాయి. తాజాగా జపాన్ లో ఘోర అగ్నిప్రమాదం  చోటుచేసుకుంది. రన్ వే పై ల్యాండ్ అవుతుండాగా ఓ విమానం మంటల్లో కాలిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

జపాన్ రాజధాని టోక్యోలోని హనేడా విమానాశ్రయంలో  ఓ విమానం అగ్నిప్రమాదానికి గురైంది. జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన జేఏల్ 516 విమానం ప్రమాదానికి  గురైంది. ఈ విమానం రన్ వేపై దిగుతుండగా  మంటల్లో చిక్కుకుంది. దీంతో క్షణాల్లోనే ఆ విమానం మొత్తం మంటలు అంటుకున్నాయి.  హోక్కైడో విమానం నుంచి బయలుదేరి హనేడాకు చేరుకున్న విమానం రన్ వే పై దిగాల్సి ఉంది. ఇక  ఈ విమానంలో  సిబ్బంది, ప్రయాణికులు మొత్తం కలిపి 400 మంది వరకు ఉన్నారని ఎన్ హెచ్ కే పేర్కొన్నట్లు జపాన్  టైమ్స్ వెల్లడించింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు వీరందరినీ బయటకు తీసుకొచ్చినట్లు తెలిపింది.

ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారో తెలియాల్సి ఉంది. జపాన్ ఎయిర్ లైన్స్ సంస్థ అధికారులు స్పందిస్తూ.. విమానం రన్ వేపై దిగిన తరువాత అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్ క్రాఫ్ట్ ఢీ కొన్నట్లు  భావిస్తున్నామని నేషనల్ మీడియా ఎన్ హెచ్ కేకు తెలియజేశారు.  ఇప్పటికీ విమానంలోని మంటలు అదుపులోకి రాలేదు.  సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలానే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి.

ఇక విమానంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఆ ఎయిర్ పోర్టు అంతా పొగతో కమ్ముకుపోయింది. దీంతో అసలు ఏం జరిగిందో తెలియక స్థానికలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదృష్టం బాగుండి.. ప్రాణ నష్టం సంభవించలేదు. కొన్ని నెలల క్రితం నేపాల్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దాదాపు 72 మంది మరణించిన సంగతి తెలిసిందే. మరి.. ఇలా విమానాలు వరుసగా ప్రమాదాలకు గురి కావడంపై మీ  అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి