iDreamPost

కరోనా వైరస్ ను వొదిలి ఎన్నికల గురించి చర్చనా? : నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం

కరోనా వైరస్ ను వొదిలి ఎన్నికల గురించి చర్చనా? : నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం

బీహార్ రాష్ట్రంలో కరోనా వైరస్ (కోవిడ్-19) గురించి చర్చించకుండా..ఎన్నికల గురించి చర్చ జరుగుతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. తన మాజీ బాస్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరిలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గతవారం నితీష్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

రాష్ట్రంలో మార్చి16 నుండి కరోనా వైరస్ సంక్షోభ నివారణ చర్యలను చేపట్టడంలో విఫలమైన నితీష్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే ప్రశాంత్ కిశోర్ కూడా విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో అంటు వ్యాధుల వ్యాప్తిని కట్టడి చేయడానికి విధించిన అత్యంత కఠినమైన లాక్ డౌన్ ను భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 24న ప్రకటించింది. ఈ లాక్ డౌన్ రెండు నెలల కాలంలో జర్నలిస్టుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించని దేశంలోని కొద్దిమంది ముఖ్యమంత్రుల్లో నితీష్ కుమార్ ఒకరు.

“దేశంలోనే అతి తక్కువ టెస్టులు చేసిన రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. రాష్ట్రంలో 7-9 శాతం పాజిటివ్ కేసుల రేటు ఉంది. దేశంలో పాజటివ్ కేసుల రేటులో కూడా బీహార్ ముందు వరుసలో ఉంది. 6,000 కన్నా ఎక్కువ కేసులు ఉన్నాయి. అయినప్పటికీ బీహార్ లో కరోనా వైరస్ కు బదులుగా ఎన్నికలపై చర్చలు‌ చేస్తున్నారు” అని ప్రశాంత్ కిశోర్ నిప్పులు చెరిగారు.

“కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన భయోత్పతాల మధ్య ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనను తాను తన ఇంటికి పరిమితం చేసుకున్నారు. కాన్ని ఎన్నికలలో పాల్గొనడానికి ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటికి వస్తే (కోవిడ్-19కు) ప్రజలు బయటపడరని సిఎం నితీష్ భావిస్తున్నారు” అని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు.

నితీష్ కుమార్ గత కొన్ని నెలలుగా ఎటువంటి మీడియా సమావేశంలో పాల్గొనకుండా దూరంగా ఉన్నారు. అంతే కాకుండా మార్చి 16 నుండి పాట్నాలోని అన్నే మార్గ్-1 తన ప్రభుత్వ బంగ్లా నుండి బయటకు రాలేదు. అతను ఈ నెలలో మొదటి బహిరంగంగా ఒక సమావేశంలో పాల్గొన్నారు. 84 రోజుల తరువాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అయితే, ఆయన తన పార్టీ కార్యకర్తలతో ఎన్నికల కోసం వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కరోనా వైరస్ కేసుల్లో బీహార్ 6,000 మార్క్ ను దాటింది. అయితే అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఎ) ఇప్పుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ (జెడియు), బిజెపి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లను అకట్టుకునేందుకు వాగ్దానాలు కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తన ప్రధాన వాగ్దానంగా రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ భూములకు నీటి పారుదల సౌకర్యాలు అందిస్తామని నితీష్ కుమార్ వాగ్దానం చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో నితీష్ కుమార్ తన పార్టీ జెడియు నుంచి తొలగించిన 43 ఏళ్ల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్…కరోనా వైరస్ కట్టడిలో బీహార్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు.

అలాగే కరోనా మహమ్మారిని పరిష్కరించడంపై కేంద్రం కూడా విఫలం అయిందని ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. “కరోనా వైరస్ కు వ్యతిరేకంగా మనం పోరాడాలి. లేకపోతే అది మరింత దిగజారిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా నాయకులు ఈ పోరాటాన్ని హ్యూమిలిటీ, ట్రాన్స్పరెన్సీ, సైన్స్ & విస్తృతమైన పబ్లిక్ బై-ఇన్ తో గెలిచారు. ఇతరుల నుండి నేర్చుకునే సమయం ఉన్నప్పటికీ కేంద్ర ప్రప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. చర్యలు చేపట్టడంలో చాలా ఆలస్యం చేశారు” ప్రశాంత్ కిషోర్ విమర్శించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి