iDreamPost

వీడియో: విమానం గాల్లో ఉండగానే ఊడిపోయిన ఇంజిన్ కవర్‌!

Pilot Emergency Landing: దూర ప్రయాణాలు చేసేవారు చాలా వరకు విమానాల్లో ప్రణిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో పలు చోట్ల విమాన ప్రమాదాలు జగరడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Pilot Emergency Landing: దూర ప్రయాణాలు చేసేవారు చాలా వరకు విమానాల్లో ప్రణిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో పలు చోట్ల విమాన ప్రమాదాలు జగరడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

వీడియో: విమానం గాల్లో ఉండగానే ఊడిపోయిన ఇంజిన్ కవర్‌!

ఈ మధ్య భూమిపైనే కాదు గాల్లో కూడా ప్రమాదాలు ఎక్కువే అవుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానాల్లో పలు కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపాలు, వాతావరణంలో మార్పులు, పక్షులు ఢీ కొట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని విమానశాఖ అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల పెద్ద ప్రమాదాలు తప్పిపోతున్నాయి. కొన్నిసార్లు ప్రమాదాల్లో పలువురు చనిపోతున్న విషయం తెలిసిందే. అమెరికాలో ఓ బోయింగ్ విమానం టేకాఫ్ కాగానే ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా విమానాల పనీతీరుపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదాలకు గురి కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కోసారి విమాన ప్రమాదం సురక్షితమేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. తాజాగా ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737-800 విమానం ఆదివారం డెన్వార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హౌస్టన్ కి బయలుదేరింది. డెన్వార్ నుంచి టేకాఫ్ అయిన పది నిమిషాల తర్వాత విమానం ఇంజన్ కవర్ ఊడిపోయి రెక్కలను ఢీ కొట్టింది.

ఇది గమనించిన పైలెట్ వెంటనే విమానాన్ని అత్యవర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల అందరి ప్రాణాలు కాపాడారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా విమాన అధికారులు మాట్లాడుతూ.. ప్రమాదంలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని అన్నారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురైనందుకు క్షమించాలని కోరింది. అలాగే ఈ ఘటనపై ఫెడర్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తు నకు ఆదేశాలు జారే చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి